ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ సామరస్యాన్ని పరిరక్షించడానికి కోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 DEC 2025 9:07AM by PIB Hyderabad

కోపం తాలూకు వినాశకారి స్వభావం గురించి చెబుతూ వ్యక్తిగత క్షేమంతో పాటు సామూహిక ప్రగతి కోసం అంతరంగ శాంతిని అలవరుచుకోవాలని సూచించే ఒక లోతైన సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు.

సంస్కృతంలో ఒక ప్రాచీన శ్లోకాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. నిర్ణయాలను తీసుకొనే సామర్థ్యాన్ని కోపం బలహీనపరిచి, సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తుందని, మానవుల్లోని సామర్థ్యాన్ని తగ్గించివేస్తుందని వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘క్రోధ: ప్రాణహర: శత్రు: క్రోధో మిత్రముఖో రిపు:
క్రోధో హ్యసిర్మహాతీక్షణ: సర్వ క్రోధోఅపకర్షతి’’ 


(रिलीज़ आईडी: 2202828) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam