ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీ లోని తన ఇంట్లో ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్ల అనువాదం

प्रविष्टि तिथि: 25 JAN 2023 6:15PM by PIB Hyderabad

 

కేంద్ర మంత్రివర్గానికి చెందిన నా సీనియర్ సహోద్యోగులుదేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారుఎన్సీసీ డైరెక్టర్ జనరల్ఉపాధ్యాయులుఅతిథులునా మంత్రిమండలి సహచరులుఇతర ప్రముఖులుగణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటున్న వివిధ కళాకారులు, నా యువ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహచరులారా!

 చాలా మంది పిల్లలు నేతాజీలా దుస్తులు ధరించిమొదటిసారిగా ప్రధాన మంత్రి నివాసానికి రావడాన్ని నేను గమనించాను. మొదటిగానేను మీ అందరికీ వందనం చేస్తున్నానుజై హింద్ మంత్రం ప్రతిసారీ మనకు ప్రేరణ ఇస్తుంది.

మిత్రులారా,

గత కొన్ని వారాలుగానేను యువ సహోద్యోగులను పదేపదే కలుసుకునే అవకాశం పొందానుఒక నెల క్రితం ‘వీర్ బాల్ దివస్’ ను జరుపుకున్నాం. వీర్ సాహిబ్ జాదీస్ (సిక్కు గురు గోవింద్ సింగ్ కుమారులు) శౌర్యం త్యాగానికి వందనం చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందిఆ తర్వాత కర్ణాటకలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ లో పాల్గొన్నానురెండు రోజుల తర్వాతనేను దేశంలోని యువ అగ్నివీరులను కలిశానుఆ తర్వాత నేను యూపీలో జరిగిన ఖేల్ మహాకుంభ్ లో యువ ఆటగాళ్లను కలిశానుఈ రోజు పార్లమెంటులో, తరువాత ప్రధాన మంత్రి నివాసంలో.. దేశం నలుమూలల నుండి ‘నో యువర్ లీడర్ కార్యక్రమం’లో పాల్గొన్న విద్యార్థులను కలిసే అవకాశం నాకు లభించిందినిన్ననేనేషనల్ చైల్డ్ అవార్డును గెలుచుకున్న పిల్లలను నేను కలిశానుఈ రోజు నేను మీ అందరినీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుంటున్నానుకొన్ని రోజులు తర్వాతనేను 'పరీక్షా పే చర్చాద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత, విద్యార్థులతో మాట్లాడబోతున్నానుప్రతి సంవత్సరం మాదిరిగానేఈసారి కూడా నేను ఎన్సీసీ  కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందుతున్నాను.

మిత్రులారా,

యువతతో నా సంభాషణలు నాకు రెండు కారణాల వల్ల చాలా ప్రత్యేకమైనవిఒకటియువతలో శక్తితాజాదనంఉత్సాహంఅభిరుచి, కొత్తదనం ఉంటాయి. ఈ సానుకూలత నాకు ప్రేరణ ఇచ్చి,  రాత్రింబవళ్లు కష్టపడటానికి నన్ను ప్రోత్సహిస్తుంది.  రెండవదిస్వాతంత్ర్యానికి చెందిన ఈ అమృత్ కాల్ లో మీరు అందరూ దేశం యొక్క ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారుమీరు అభివృద్ధి చెందిన భారతదేశం ప్రయోజనాన్ని పొందనున్నారు. అందుక పునాదిగా నిలవాల్సిన  బాధ్యత కూడా మీ భుజాలపై ఉంది వివిధ కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా ఒక ముఖ్యమైన సందేశంతో జరిగే పోటీల్లో మీలాంటి పిల్లలు పాల్గొనడం ఒక మంచి ఉదాహరణ అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన ఇలాంటి అనేక కార్యక్రమాలుపోటీలు దేశంలో తరచూ జరుగుతున్నాయికోట్లాది మంది యువకులు ఇందులో పాల్గొంటున్నారుఇది చిన్న వయస్సులోనే దేశం కోసం పెద్ద కలలు కనడానికి, అంకితభావానికి ప్రతీకభారతదేశంలోని యువత దేశ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందనితమ బాధ్యతలను నెరవేర్చడంలో కట్టుబడి ఉన్నారని ఇది నిరూపిస్తుందికవిత్వండ్రాయింగ్డ్రెస్సింగ్వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన యువకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానుఈసారి కూడా పెద్ద సంఖ్యలో మన ఎన్సీసీఎన్ఎస్ఎస్ క్యాడెట్లు మరియు వివిధ కళాకారులు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్నారుమీ అందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్... యువతను జాతీయ లక్ష్యాలు, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానం సంస్థలుకరోనా కాలంలో ఎన్సీసీఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సామర్థ్యాన్ని ఎలా నిరూపించారో మన దేశం మొత్తం చూసిందిఅందువల్లఈ సంస్థలను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తోందిఉదాహరణకుమన సరిహద్దు, సముద్ర తీర జిల్లాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి వాటిని ఎదుర్కోడానికి మీలాంటి యువతను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందిదేశంలో అలాంటి డజన్ల కొద్దీ జిల్లాల్లో ఎన్సీసీ ప్రత్యేక కార్యక్రమం  జరుగుతోందిసైన్యంనావికాదళం, వైమానిక దళం ద్వారా ప్రత్యేక శిక్షణ అందుతోందిఫలితంగాయువ సహచరులు భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటారు. అవసరమైతే తక్షణం స్పందించే పాత్రను కూడా పోషించగలరుఇప్పుడు మేము ‘వైబ్రెంట్ బోర్డర్ ఏరియా’ కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నాంఈ కార్యక్రమం కింద సరిహద్దు గ్రామాలను అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారుసరిహద్దు ప్రాంతాల్లోని యువత శక్తి సామర్థ్యాలను పెంచడం, కుటుంబాలు తమ గ్రామాల్లో ఉండటానికి ఇష్టపడేలా చేయడం, అలాగే విద్య, ఉపాధికి మెరుగైన అవకాశాలను కలిగించడం ప్రధాన ఉద్దేశం.

మిత్రులారా,

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల మధ్యమీ జీవితంలో ఒక విషయం ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందిమీరు జీవితంలో ఏదైనా విజయం సాధించినప్పుడు,  దాని వెనుక మీతో పాటు మీ తల్లిదండ్రులు, కుటుంబం పాత్ర కూడా ఉంటుంది. మీ ఉపాధ్యాయులుపాఠశాలమీ స్నేహితులు కూడా అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారుఅలా మీరు అందరి మద్దతును పొందుతారుఅదే మీ పురోగతికి కారణంప్రతి ఒక్కరూ మీ సామర్థ్యం, నిర్ణయాలను విశ్వసించి ఉంటారు.  ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నంలో చేరి ఉంటారు. ఇప్పుడు మీరు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్నందునఇది మీ కుటుంబంపాఠశాలకళాశాల మరియు స్థానికుల గౌరవాన్ని కూడా పెంచిందిఅంటేమీ విజయాలు కేవలం మీ ప్రయత్నాల వల్లే రావు.  మన విజయాలు ఎప్పుడూ మనవి మాత్రమే కావుమీరు మీ జీవితంలో సమాజం మరియు దేశం పట్ల అదే వైఖరిని కొనసాగించాలిమీకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా మీరు ముందుకు సాగాలికానీమీ లక్ష్యాన్ని సాధించడంలో మీరు చాలా మందిని మీతో తీసుకెళ్లాలిమీరు బృంద స్ఫూర్తితో కలిసి పనిచేయాలిఅందువల్లమీరు మీ లక్ష్యాలను దేశం యొక్క లక్ష్యాలతో సరిపోల్చినప్పుడుమీ విజయానికి అవకాశం మరింత విస్తరిస్తుందిమీ విజయాన్ని భారతదేశం విజయంగా ప్రపంచం చూస్తుందిడాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హోమీ జహంగీర్ భాభా, డాక్టర్ సివిరామన్ లాంటి శాస్త్రవేత్తలు కావచ్చు, లేదా మేజర్ ధ్యాన్ చంద్, ప్రస్తుత క్రీడాకారులు కావచ్చు... వాళ్లు సాధించిన విజయాలను ప్రపంచం మొత్తం భారతదేశం విజయంగా భావిస్తారుఅంతేకాకుండాభారతదేశానికి చెందిన ఈ విజయాలలో ప్రపంచం తన కొత్త భవిష్యత్తు చూస్తుందిఅంటేచారిత్రక విజయాలు మొత్తం మానవాళి అభివృద్ధికి మెట్లుగా మారతాయి‘సబ్కా ప్రయాస్’ (ప్రతి ఒక్కరి కృషిస్ఫూర్తి యొక్క నిజమైన శక్తి ఇదే.

మిత్రులారా,

ఈ రోజు మీరు ఉన్న కాలానికి ఇంకో ప్రత్యేక విషయం ఉందినేడుదేశంలో యువతకు లభించే కొత్త అవకాశాలు అసాధారణంగా ఉన్నాయినేడు దేశం స్టార్టప్ ఇండియామేక్ ఇన్ ఇండియాఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రచారాలను నిర్వహిస్తోందిఅంతరిక్ష రంగం నుంచి పర్యావరణంవాతావరణం మరియు వాటితో సంబంధం ఉన్న సవాళ్ల వరకుభారతదేశం నేడు మొత్తం ప్రపంచం భవిష్యత్తు కోసం కృషి చేస్తోందిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మెషిన్ లెర్నింగ్వర్చువల్ రియాలిటీ వంటి భవిష్యత్ రంగాల్లో మన దేశం ముందంజలో ఉందిక్రీడలు మరియు సృజనాత్మకత కోసం దేశం మెరుగైన పర్యావరణాన్ని కూడా సృష్టించిందిమీరు అందులో భాగం కావాలిమీరు కనిపించని అవకాశాలను వెతకాలికొత్త ప్రాంతాలను అన్వేషించాలి మరియు ఊహించని పరిష్కారాలను కనుగొనాలి.

 

మిత్రులారా,

భవిష్యత్తు కోసం పెద్ద లక్ష్యాలు మరియు తీర్మానాలు మనకు చాలా ముఖ్యమైనవికానీ అదే సమయంలోచిన్న ప్రాధాన్యతలకు కూడా మనం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలిఅందువల్లదేశంలో జరుగుతున్న ప్రతి మార్పు గురించి మీరంతా తెలుసుకోవాలని నేను కోరుతున్నానుదేశంలో జరుగుతున్న కొత్త ప్రచారాలలో మీరు తప్పకుండా పాల్గొనాలిస్వచ్ఛ భారత్ అభియాన్ ఉదాహరణ మన ముందుందియువత దీనిని తమ జీవితంలో లక్ష్యం చేసుకోవాలిమీలో సృజనాత్మకతతో పాటు ఉత్సాహం కూడా ఉందిమీ మిత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిమీ ప్రాంతంగ్రామంనగరం, పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తామని మీరు ప్రతిజ్ఞ చేయవచ్చుమీరు పరిశుభ్రత మిషన్ కోసం బయటకు వెళ్లినప్పుడుఇది వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందిఅదేవిధంగాఅమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల గురించి కనీసం ఒక పుస్తకం చదవాలని మీరు తీర్మానం చేసుకోవాలిమీలో చాలా మంది కవితలుకథలు రాస్తారు. అలాగే వ్లాగింగ్ పట్ల కూడా ఆసక్తి చూపిస్తారుస్వాతంత్య్ర సంగ్రామం, స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక సృజనాత్మక కార్యక్రమాన్ని చేపట్టండి.  ఈ అంశంపై కార్యక్రమాలు, పోటీలను నిర్వహించడానికి మీరు మీ పాఠశాలను కూడా అడగవచ్చుమీ ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లను కూడా నిర్మిస్తున్నాంమీ మిత్రులను నిమగ్నం చేస్తూమీరు మీ సమీపంలోని అమృత్ సరోవర్ కు చాలా దోహదం చేయవచ్చు ఉదాహరణకుమీరు అమృత్ సరోవర్ చుట్టూ చెట్లు నాటవచ్చుదాని నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించవచ్చుమీరు దేశంలో జరుగుతున్న ఫిట్ ఇండియా ఉద్యమం గురించి కూడా వినే ఉంటారుఇది యువతకు చాలా ఆకర్షణీయమైన ప్రచారంమీరు ఇందులో చేరడమే కాకుండామీ కుటుంబ సభ్యులను కూడా చేరమని అడగండిమీరు ప్రతిరోజూ ఉదయం మీ కుటుంబంతో కలిసి యోగా చేసే ఈ అభ్యాసాన్ని ప్రారంభించవచ్చుఈ సంవత్సరం జి-20 కి భారతదేశం కూడా అధ్యక్షత వహిస్తున్నదని మీరు వినే ఉంటారుఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన అవకాశంమీరు దాని గురించి కూడా చదవాలి. మీ పాఠశాలకళాశాలలో కూడా చర్చించాలి.

మిత్రులారా,

ప్రస్తుతందేశం ‘మన వారసత్వంపై గర్వం’,  ‘బానిస మనస్తత్వం నుండి స్వేచ్ఛ’ అనే తీర్మానంతో ముందుకు సాగుతోందిఈ తీర్మానాల పట్ల దేశంలోని యువతకు కూడా బాధ్యత ఉందిభవిష్యత్తు కోసం మన వారసత్వాన్ని కాపాడడం, అభివృద్ధి చేయడం మీ బాధ్యతమీరు దేశ వారసత్వాన్ని తెలుసుకునిఅర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పని చేయగలుగుతారుమీరు పర్యటనకు వెళ్ళేటప్పుడువారసత్వ ప్రదేశాలను తప్పక సందర్శించాలని నేను సూచిస్తున్నానుమీరు యువకులు కాబట్టిభవిష్యత్తు కోసం ఒక దార్శనికతను నిర్మించడానికి ఇది సరైన సమయంమీ ఆలోచనలు, ప్రమాణాలకు మీరే సృష్టికర్త.   మీరు నవభారతానికి మార్గం సుగమం చేసే వ్యక్తులు. మీరు దేశం యొక్క అంచనాలను మరియు ఆకాంక్షలను కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానుమీ అందరికీ మరోసారి చాలా శుభాకాంక్షలు!

ధన్యవాదాలు!

గమనిక : ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి స్వేచ్చా అనువాదంఅసలు ప్రసంగం హిందీలో జరిగింది.

 

***


(रिलीज़ आईडी: 2202673) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam