రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పటిష్టమైన సైబర్ భద్రతతో టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను బలోపేతం చేయనున్న భారతీయ రైల్వే జనవరి 2025 నుంచి 3.02 కోట్ల అనుమానాస్పద వినియోగదారు ఖాతాల నిలిపివేత; నిజమైన టికెటు బుకింగ్‌ను


నిర్ధరించేందుకు ‘యాంటీ బాట్’ చర్యలు అమలు

ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ల కోసం 322 రైళ్లలో, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా 211 రైళ్లలో ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి

96 ప్రముఖ రైళ్లలో 95 శాతం పెరిగిన నిర్ధారిత తత్కాల్ టికెట్ల లభ్యత సమయం

प्रविष्टि तिथि: 11 DEC 2025 2:12PM by PIB Hyderabad

భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా.. అత్యాధునిక సైబర్ భద్రతా నియంత్రణలతో కూడిన దృఢమైనఅత్యంత సురక్షితమైన సాంకేతిక వేదిక.రిజర్వేషన్ వ్యవస్థ పనితీరునుసాధారణ/తత్కాల్ టిక్కెట్ల లభ్యతను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే అనేక చర్యలు చేపట్టిందివాటిలో కొన్ని..

 

1. వినియోగదారు ఖాతాల ధృవీకరణ, పరిశీలన జరిగింది.2025 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 3.02 కోట్ల అనుమానాస్పద వినియోగదారు ఖాతాలు నిలిపివేసింది.

2. నిజమైన ప్రయాణీకులకు సులభంగా బుకింగ్ జరిగేలా చూడటానికినకిలీ వినియోగదారులను తొలగించేందుకు అకామై (ఏకేఏఎమ్ఏఐవంటి యాంటీ బాట్ పరిష్కారాలను రైల్వే వ్యవస్థ అమలు చేస్తుంది.

3. ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికిపారదర్శకతను మెరుగుపరచడానికి ఆధార్-ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీధృవీకరణను దశలవారీగా ప్రవేశపెట్టిందిడిసెంబర్ నాటికి 322 రైళ్లలో ఈ విధానం అమలులో ఉందిఈ చర్యల కారణంగా 322 రైళ్లలో సుమారు 65 శాతం ధ్రువీకరించిన తత్కాల్ టికెట్ లభ్యత సమయం పెరిగింది.

 

4. రిజర్వేషన్ కౌంటర్లలో చేసే తత్కాల్ బుకింగ్‌ల కోసం కూడా ఆధార్-ఆధారిత ఓటీపీని దశలవారీగా ప్రవేశపెట్టిందిఇది డిసెంబర్ నాటికి 211 రైళ్లలో అమలవుతుంది.

5.ఈ చర్యల ఫలితంగా 96 ప్రముఖ రైళ్లలో సుమారు 95 శాతం నిర్ధారిత తత్కాల్ టికెట్ లభ్యత సమయం పెరిగింది.

6. అనుమానాస్పదంగా బుక్ చేసిన పీఎన్ఆర్ ల కోసం జాతీయ సైబర్ నేర వేదికలో ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు.

7. భారతీయ రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను సైబర్ బెదిరింపుల నుంచి రక్షించేందుకు అనేక చర్యలు చేపట్టిందివాటిలో నెట్‌వర్క్ ఫైర్‌వాల్‌లు, చొరబాటు నివారణ వ్యవస్థలుఅప్లికేషన్ డెలివరీ కంట్రోలర్లువెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లు ఉన్నాయిఈ వ్యవస్థ ప్రత్యేకమైన,ప్రవేశ నియంత్రణ కలిగిన డేటా సెంటర్‌లో సీసీటీవీ నిఘా ద్వారాఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుందిఈ డేటా సెంటర్ ఐఎస్ఓ 27001 సమాచార భద్రతా నిర్వహణ వ్యవస్థ ప్రమాణాల ప్రకారం ధృవీకరించింది.

సైబర్ భద్రతా స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికిభారత రైల్వే టెలికమ్యూనికేషన్స్ సంస్థ సమగ్ర సైబర్ ముప్పు నిఘా సేవలను అందిస్తుందివీటిలో టేక్-డౌన్ సేవలుబెదిరింపుల పర్యవేక్షణలోతైనచీకటి వెబ్ నిఘా, డిజిటల్ రిస్క్ రక్షణ ఉన్నాయిఈ సేవలు కొత్తగా తలెత్తుతున్న సైబర్ బెదిరింపులపై చురుకైనక్రీయాశీల చర్యలను అందిస్తాయిదీని ద్వారా సంఘటన జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమవుతుంది.

 

8. రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన భద్రతా ఆడిట్‌లను సీఈఆర్-ఇన్ ఆమోదించిన సమాచార భద్రతా ఆడిట్ సంస్థలు నిర్వహిస్తాయి. సైబర్ దాడులను గుర్తించి నిరోధించడానికి టికెటింగ్ వ్యవస్థకు సంబంధించిన ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను సీఈఆర్-ఇన్జాతీయ కీలక సమాచార మౌలిక వసతుల రక్షణ కేంద్రం(ఎన్ సీఐఐపీసీనిరంతరం పర్యవేక్షిస్తాయి.

 

రైల్వే బోర్డుజోనల్ రైల్వేలుడివిజనల్ కార్యాలయాలు వంటి వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులుసంస్థలురైలు వినియోగదారులు మొదలైన వారి నుంచి అధికారికంగాఅనధికారికంగా వచ్చే విజ్ఞప్తులు,సూచనలుఅభ్యర్థనలను నిరంతరం స్వీకరిస్తారు.ఇలాంటి అభ్యర్థనలుసూచనలు స్వీకరించడం నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ అభ్యర్థనలను కేంద్రీకృతంగా నిర్వహించడం వీలు కాదుఅయినప్పటికీ వీటిని పరిశీలించి సాధ్యమయ్యేసమర్థించదగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారుఇది ఒక నిరంతర ప్రక్రియ.

ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే,సమాచారప్రసార,ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.


(रिलीज़ आईडी: 2202669) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada