మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చివరి నిమిషంలో పెరిగిన వేగం, అద్భుతమైన పనితీరు: వక్ఫ్ బోర్డులు నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ, భారీగా అప్‌లోడ్‌లను సమర్థవంతంగా నిర్వహించిన యూఎంఈఈడీ పోర్టల్
प्रविष्टि तिथि:
09 DEC 2025 8:31PM by PIB Hyderabad
యూఎంఈఈడీ పోర్టల్ 2025 జూన్ 6న ప్రారంభమైనప్పటి నుంచి డేటాను అప్‌లోడ్ చేసేందుకు శిక్షణ ఇవ్వటానికి, సిద్ధం చేయటానికి వక్ఫ్ బోర్డుతో కలిసి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలుపెరుగని కృషి చేసింది. అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఏడు జోనల్ సమీక్షా-శిక్షణా సమావేశాలను నిర్వహించింది. సామర్థ్య నిర్మాణానికి 30 రాష్ట్రాలు, యూటీలు.. 32 వక్ఫ్ బోర్డులకు దాదాపు రూ.10 కోట్లకు పైగా నిధులను విడతలవారీగా విడుదల చేసింది. హెల్ప్‌లైన్ మద్దతు, వీసీ ఆధారిత శిక్షణ తరగతులు, మాస్టర్ ట్రైనర్ వర్క్‌షాప్ లను కూడా నిర్వహించింది. విస్తృత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరునెలల సమయంలో మొదటి నాలుగు నెలలను వక్ఫ్ బోర్డులు ఉపయోగించుకోలేకపోయాయి. పోర్టల్‌లో 2.42 లక్షలకు పైగా ఆస్తుల వివరాలను నమోదు చేశాక, నవంబర్‌లో వారు క్రియాశీలకంగా మారారు. జూన్‌లో కేవలం 11 అప్‌లోడ్‌లు కాగా, జూలైలో 50, ఆగస్టులో 822, సెప్టెంబర్‌లో 4,000కు పైగా అప్‌లోడ్‌లు జరిగాయి. ప్రారంభంలో ఈ ప్రక్రియను బోర్డులు ఎంత సాధారణంగా పరిగణించాయో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతమున్న ఆస్తులను యూఎంఈఈడీ పోర్టల్‌లో అప్‌లోడ్‌లను చేయటంలో వక్ఫ్ బోర్డుల ప్రాధాన్యతను అర్థం చేసుకునేందుకు కింద ఉన్న పట్టిక వివరణాత్మకంగా ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2201395)
आगंतुक पटल : 3