రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సాగర బంధు – మరో నాలుగు యుద్ధ నౌకల ద్వారా శ్రీలంకకు మానవీయ సాయాన్నీ, విపత్తు ఉపశమన సామగ్రిని అందిస్తున్న భారత నావికా దళం
प्रविष्टि तिथि:
08 DEC 2025 11:00AM by PIB Hyderabad
శ్రీలంకకు తక్షణ గాలింపు, రక్షణ, మానవీయ సాయం - విపత్తు ఉపశమన చేయూత (హెచ్ఏడీఆర్)ను అందించేందుకు ప్రారంభించిన ఆపరేషన్ సాగర బంధులో భాగంగా.. ఆ దేశంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు హెచ్ఏడీఆర్ సామగ్రిని సరఫరా చేయడం కోసం భారత నావికా దళం మరో నాలుగు నౌకలు ఐఎన్ఎస్ ఘరియల్, ఎల్‌సీయూ 54, ఎల్‌సీయూ 51, ఎల్‌సీయూ 57లను పంపించింది.
ఇంతకుముందు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సుకన్య సహాయక చర్యలనూ.. హెలికాప్టర్ ద్వారా గాలింపు, రక్షణ చర్యలను అందించాయి.
మూడు ఎల్‌సీయూలు (ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ) 2025 డిసెంబరు 7న ఉదయం కొలంబో చేరుకుని.. కీలక సహాయక సామగ్రిని శ్రీలంక అధికారులకు అందించాయి. మానవీయ సహాయక కార్యకలాపాల్లో కొనసాగింపుగా.. 2025 డిసెంబరు 8న ఐఎన్ఎస్ ఘరియల్ ట్రింకోమలీకి చేరుకోనుంది.
1000 టన్నుల సామగ్రిని సహాయం కోసం భారత్ అందించింది. నౌకలను పంపించి భారత్ అందిస్తున్న ఈ సాయం.. భారత్ - శ్రీలంక మధ్య బలమైన ప్రజా సంబంధాలను, అలాగే హిందూ మహా సముద్ర ప్రాంతంలో పొరుగు దేశాలకు సకాలంలో మానవీయ సాయమందించడంలో భారత నావికాదళ అంకిత భావాన్ని స్పష్టం చేస్తోంది.
(रिलीज़ आईडी: 2200668)
आगंतुक पटल : 4