పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశీ పర్యాటకులకు భద్రత

प्रविष्टि तिथि: 08 DEC 2025 2:46PM by PIB Hyderabad

పర్యాటకుల భద్రత, సురక్ష ప్రధానంగా రాష్ట్ర పరిధిలోని అంశం. ఏమైనా, ఈ విషయాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాల దృష్టికి  నిరంతరంగా తీసుకుపోతోంది. క్షేత్ర స్థాయిలో పర్యాటకుల సురక్ష యంత్రాంగాన్ని పటిష్ఠపరచడానికంటూ ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తోంది. పర్యాటక శాఖ చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టూరిస్టు పోలీసులను రంగంలోకి దింపాయి. ఈ పనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కింతో పాటు ఉత్తరప్రదేశ్ పూర్తి చేశాయి.
సేవల అందజేతలో లోపం, మోసం చేయడం వగైరా అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇబ్బందులు, సలహాలను కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సెంట్రలైజ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్.. సీపీజీఆర్ఏఎంఎస్) పోర్టల్ ద్వారా పర్యాటక శాఖ స్వీకరిస్తోంది. పౌరులు పర్యటనకు సంబంధించిన తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్ వారంలో 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. విదేశీ టూరిస్టులు కూడా తమ ఫిర్యాదుల్నీ, తమకు ఎదురైన ఇబ్బందుల్నీ .. భారత్‌లో నమోదైన మొబైల్ నంబరు ద్వారా.. ఈ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. పర్యాటకులకు ప్రయాణాన్ని సురక్షితమైందిగానూ, పదిలమైందిగానూ తీర్చిదిద్దడానికి  పర్యటన మంత్రిత్వ శాఖ నిరంతరం చేస్తున్న కృషిలో భాగంగా, వారంలో 24 గంటల పాటూ అనేక భాషల్లో టూరిస్ట్ హెల్ప్‌లైనును.. 1800111363 టోల్‌ఫ్రీ నంబరుతో.. ఏర్పాటు చేసింది. ఇది కాక 10 అంతర్జాతీయ భాషలు (జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్, జాపనీస్, కొరియన్, అరబిక్) సహా హిందీ, ఇంగ్లీషు.. మొత్తం 12 భాషల్లో.. 1363  కోడ్ నంబరుతో కూడా సహాయక వ్యవస్థను దేశీ, విదేశీ పర్యాటకులకు అందుబాటులో ఉంచారు. భారత్‌లో ప్రయాణానికి సంబంధించిన సమాచారం తాలూకు సహాయక సేవల్నీ,  ఇండియాలో ప్రయాణిస్తున్న పర్యాటకులు ఒకవేళ ఆపదలో చిక్కుకున్నట్లయితే వారికి అవసరమైన మార్గదర్శనాన్నీ వీటి ద్వారా అందిస్తున్నారు.

అదనంగా, ఎన్నటికీ సమాప్తం కానటువంటి ప్రత్యేక మూల నిధిని ప్రభుత్వం ‘నిర్భయ ఫండ్’ పేరుతో ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ నిధిని నిర్వహిస్తోంది. దీనిని మహిళల సురక్షనూ, భద్రతనూ మెరుగుపరచడానికి ప్రత్యేకించిన ప్రాజెక్టుల కోసం వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది.
నిర్భయ నిధి కింద ‘మహిళలకు సురక్షితమైన పర్యాటక గమ్యస్థానాల’ ప్రయోజనాల్ని అందుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలను పర్యాటక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తోంది. ఈ నిధిని మహిళా పర్యాటకుల సురక్షనూ, భద్రతనూ మెరుగుపరచడానికి రూపొందించిన నిర్దిష్ట ప్రాజెక్టుల కోసం వినియోగించుకోవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2200663) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada