ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని నివాళి

प्रविष्टि तिथि: 06 DEC 2025 9:11AM by PIB Hyderabad

మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి ఈ రోజు నివాళులు అర్పించారు.

న్యాయంసమానత్వంరాజ్యాంగ వ్యవస్థ పట్ల డాక్టర్ అంబేద్కర్‌కు ఉన్న అంకితభావం.. దేశానికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారువ్యక్తి గౌరవాన్ని కాపాడటంలోప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో డాక్టర్ అంబేద్కర్ కనబరిచిన నిబద్దత నుంచి తరతరాలు స్ఫూర్తి పొందుతాయని ఆయన అన్నారు.

వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ప్రయాణిస్తున్న మార్గంలో అంబేద్కర్ ఆదర్శాలు వెలుగులు నింపుతాయనే విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

‘‘మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకుంటున్నానుఆయన దార్శనిక నాయకత్వంన్యాయంసమానత్వంరాజ్యాంగ వ్యవస్థ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయివ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికిప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి తరతరాలకు ఆయన స్ఫూర్తినందిస్తారువికసిత్ భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ప్రయాణిస్తున్న మార్గంలో ఆయన ఆదర్శాలు వెలుగులు నింపుతాయి’’

 

***


(रिलीज़ आईडी: 2200047) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam