ప్రధాన మంత్రి కార్యాలయం
హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సు ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
06 DEC 2025 10:40PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సు ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా విడిగా చేసిన కొన్ని పోస్టుల ద్వారా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"న్యూఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ ఫోటో పోటీల విజేతలు ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభ అందరికీ స్ఫూర్తినిస్తుంది’’.
"నేటి భారత్ తనను తాను మార్చుకుంటోంది... రేపటి కోసమూ పరివర్తన చెందుతోంది. అందుకే ప్రపంచంలోని అనిశ్చితుల మధ్య కూడా భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది’’.
"దశాబ్దాలుగా ఉపయోగించుకోని తన సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దార్శనికతతో భారత్ ఈ రోజు పనిచేస్తోంది... ఇది దేశాన్ని కచ్చితంగా మారుస్తుంది’’.
"నేటి సంస్కరణలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు... జాతీయ లక్ష్యాల కోసం అమలు చేస్తున్నవి. అందుకే దేశంలోని ప్రతీ రంగం మెరుగుపడుతోంది’’.
"ఈ రోజు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది... ఎవరూ దానిని హిందూ వృద్ధి రేటు అని పిలవరు. ఒకప్పటి భారత బలహీనమైన ఆర్థిక వృద్ధి మన విశ్వాసంతో ముడిపడి ఉందనే బానిస మనస్తత్వానికి ఇది ప్రతిబింబం... అయినప్పటికీ మేధావులు అని పేరున్న వారు దానిలోని మతతత్వాన్ని చూడలేకపోయారు’’.
"దేశంలో మానసిక బానిసత్వానికి బీజాలు వేసిన మెకాలే విధానాన్ని మనం రాబోయే 10 సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలించాలి. 140 కోట్ల మంది భారతీయులకు ఇది నా విజ్ఞప్తి...’’
“మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం వంటి మిషన్లు 4-5 దశాబ్దాల కిందటే ప్రారంభమై ఉంటే, నేటి భారత్ మరింత భిన్నంగా ఉండేది!
"దేశ భవిష్యత్తును మార్చడంలో మన ప్రస్తుత ప్రణాళికల శక్తిని... నా నియోజవర్గమైన కాశీని ఒక ఉదాహరణగా తీసుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రజలకు కోట్లాది రూపాయలు ఆదా చేయడమే కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షించడంలోనూ చాలా సహాయకారిగా ఉందని నిరూపితమవుతోంది’’.
(రిలీజ్ ఐడి: 2200017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam