ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 DEC 2025 9:43AM by PIB Hyderabad
ఇవాళ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, చిరుత పులుల రక్షణకు అంకితమైన వన్యప్రాణి ప్రేమికులకు, సంరక్షకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమిది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, భూమిపైనున్న అద్భుతమైన జీవుల్లో ఒకటైన చిరుత పులిని రక్షించటానికి అంకితమైన వన్యప్రాణుల ప్రేమికులందరికీ, సంరక్షకులకు నా శుభాకాంక్షలు. చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ ప్రాజెక్టు"
***
(रिलीज़ आईडी: 2199169)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam