ప్రధాన మంత్రి కార్యాలయం
చిరుత సంరక్షణ కార్యక్రమం పునఃప్రారంభం
వన్యప్రాణి సంరక్షణ నిబద్ధతను వివరించిన వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 DEC 2025 2:34PM by PIB Hyderabad
చిరుత సంరక్షణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం వన్య ప్రాణి సంరక్షణ విషయంలో మన నిబద్ధతను ఎలా చాటిచెబుతున్నదీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. దేశంలో చిరుత సంతతి వృద్ధికావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. ‘‘భారత్‌లో ఒక ఆడ చిరుత 5 కూనలకు జన్మనివ్వడం.. చిరుతలు భారతీయ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడ్డాయనడానికి ప్రబల నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌కు శ్రీ మోదీ సమాధానమిస్తూ :
‘‘దేశంలో చిరుతల సంతతి పెరుగుతూ ఉండడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. భారత్‌లో పుట్టిన ఒక ఆడ చిరుత 5 కూనలకు జన్మనివ్వడం.. చిరుతలు పూర్తి స్థాయిలో భారతీయ వాతావరణానికి అలవాటు పడ్డాయనడానికి ప్రబల నిదర్శనం. దేశంలో మళ్లీ చిరుతలను పెంచే కార్యక్రమం.. వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో మన నిబద్ధతను ఎలా చాటిచెబుతున్నదీ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తన వ్యాసంలో వివరించారు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2199157)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam