ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ స్వరాజ్ కౌశల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 04 DEC 2025 5:55PM by PIB Hyderabad

శ్రీ స్వరాజ్ కౌశల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. న్యాయవాదిగా, న్యాయ వృత్తిని ఉపయోగించి అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచాలని నమ్మిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని అన్నారు. “భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన గవర్నర్ ఆయన. గవర్నరుగా పదవీకాలంలో మిజోరాం ప్రజలపై ఆయన చెరగని ముద్ర వేశారు. పార్లమెంటేరియన్‌గా ఆయన చెప్పిన విషయాలు కూడా గమనార్హం" అని వ్యాఖ్యానించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు: 

"శ్రీ స్వరాజ్ కౌశల్ మృతి బాధ కలిగించింది. న్యాయవాదిగా, అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచడానికి న్యాయ వృత్తిని ఉపయోగించాలని నమ్మిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌. గవర్నరు పదవీకాలంలో ఆయన మిజోరాం ప్రజలపై చెరగని ముద్ర వేశారు. పార్లమెంటేరియన్‌గా ఆయన చెప్పిన విషయాలు కూడా గమనార్హం. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుమార్తె బాన్సురి, ఇతర కుటుంబ సభ్యులతో ఉన్నాయి. ఓం శాంతి".

 

***


(रिलीज़ आईडी: 2199140) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil