ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ-సిగరెట్ల దొంగరవాణా ముఠా గుట్టు రట్టు చేసిన డీఆర్ఐ..


రూ.14.74 కోట్ల ఇ-సిగరెట్లు ట్యూటికోరిన్‌లో స్వాధీనం... ముగ్గురి అరెస్టు

प्रविष्टि तिथि: 02 DEC 2025 2:30PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్ సిగరెట్ల దిగుమతిపై నిషేధం అమలవుతుండగాఆ సిగరెట్లను దొంగరవాణా చేస్తున్న ఓ ప్రధాన ముఠాను రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐట్యూటికోరిన్ రేవులో పట్టుకుందిరూ.10.41 కోట్ల విలువైన ఇ-సిగరెట్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారుకేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు.
ఒక ముఠా ఇ-సిగరెట్లను దొంగరవాణా చేస్తోందని నిర్దిష్ట రహస్య సమాచారం అందిన మీదట డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారుగొడుగులు తెప్పించుకునే పేరిట చైనా నుంచి ఇ-సిగరెట్ల కంటెయినర్‌ను ట్యూటికోరిన్ రేవు గుండా భారత్‌లోకి తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆ కంటెయినర్‌ను గత నెల 27న మార్గమధ్యంలో ఆపి పరీక్షించారు.
ఆ కంటెయినర్‌లో కొన్ని కార్టన్లలో చెప్పిన ప్రకారం గొడుగులు ఉన్నాయిఅయితే వాటి కింది భాగంలోని చాలా వరకు కంటెయినర్లలో ఇ-సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించారువేర్వేరు రుచుల ఇ-సిగరెట్లు 45,984 ఉన్నాయివాటి విలువ రూ.10.41 కోట్లువాటితో కలిపి రవాణా చేస్తున్న 4,300 గొడుగుల విలువ రూ.4.30 లక్షలుసరకును కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం 2025 నవంబరు 27న స్వాధీనం చేసుకున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2197560) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR