ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పలు ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 05 OCT 2023 1:03PM by PIB Hyderabad

వేదికను అలకరించిన రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రాకేంద్రమంత్రి వర్గంలో నా సహచరులుదేశానికి సేవకులైన గజేంద్ర సింగ్ షెకావత్కైలాష్ చౌదరిరాజస్థాన్ ప్రభుత్వ మంత్రి భజన్‌లాల్పార్లమెంటు సభ్యులుభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సీపీ జోషిఇతర పార్లమెంటు సభ్యులుప్రతినిధులకుమహిళలుపెద్దలందరికీ స్వాగతం!

ముందుగావీర దుర్గాదాస్ రాథోడ్‌కు చెందిన ఈ ధైర్యభూమికి నా హృదయపూర్వక వందనాలుఈరోజు మార్వార్‌లోని పవిత్ర భూమి జోధ్‌పూర్‌లో ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయిరాజస్థాన్ అభివృద్ధికి ఏళ్లుగా మేము చేస్తున్న నిరంతర కృషి స్పష్టంగా కనిపిస్తోందిఇవాళ దాని ఫలితాలను అనుభవిస్తున్నాంఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్రాచీన భారత వైభవాన్నిదేశ శౌర్యంసంపదసంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన దృశ్యాలను రాజస్థాన్‌లో చూడవచ్చుఇటీవల జోధ్‌పూర్‌లో జరిగిన జీ20 సదస్సు ప్రపంచవ్యాప్త అతిథుల ప్రశంలందుకుందిమన దేశ పౌరులైనావిదేశీ పర్యాటకులైనాప్రతి ఒక్కరూ ఒక్కసారైనా జోధ్‌పూర్‌లోని సన్‌ సిటీని సందర్శించాలనుకుంటారుమెహ్రాన్‌గఢ్జస్వంత్‌ థడా వంటి ప్రాంతాలను చూడాలని కోరుకోవటంతో పాటుస్థానిక హస్తకళల పట్ల వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుందిభారత్ గత వైభవాన్ని సూచించే రాజస్థాన్దేశ భవిష్యత్తుకు కూడా ప్రతీకగా నిలవటం అవసరంమేవాడ్ నుంచి మార్వాడ్ వరకు రాజస్థాన్ వ్యాప్తంగా అభివృద్ధి జరిగినప్పుడుఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందిజోధ్‌పూర్ గుండా బికనీర్ నుంచి జైసల్మేర్‌ వరకున్న ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ రాజస్థాన్‌లో ఆధునికహైటెక్ మౌలిక సదుపాయాలకు ఒక ఉదాహరణరాజస్థాన్‌లోని ప్రతి రంగంలో రైలురోడ్డు మార్గాలతో పాటు ప్రతి అంశంలోనూ భారత ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తుంది.

ఈ ఏడాదిలో రాజస్థాన్‌ రైల్వే అభివృద్ధికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించాంగత ప్రభుత్వాల వార్షిక సగటు కంటే ఈ బడ్జెట్ దాదాపు 14 రెట్లు ఎక్కువనేను ఇక్కడ రాజకీయ ప్రకటన చేయటం లేదు.. వాస్తవ సమాచారాన్ని అందిస్తున్నానులేదంటే 'మోదీ శక్తిమంతమైన దాడిఅని మీడియా రాస్తుందిస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు రాజస్థాన్‌లో కేవలం 600 కిలోమీటర్ల రైలు మార్గాలు మాత్రమే విద్యుదీకరణ చేస్తేగత ఏళ్లలో 3,700 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తయిందిడీజిల్ ఇంజిన్లకు బదులుగావిద్యుత్ ఇంజిన్లతో నడిచే రైళ్లు ట్రాక్‌లపై పరుగులు పెట్టనున్నాయిదీని వల్ల రాజస్థాన్‌లో కాలుష్యం తగ్గటమే కాకగాలి కూడా శుభ్రంగా ఉంటుందిఅమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రాజస్థాన్‌లో 80 కంటే ఎక్కువ రైల్వేస్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాంఅనేక ప్రాంతాల్లో ధనవంతులు వెళ్లే విమానాశ్రయాలను అద్భుతంగా నిర్మించే ధోరణి ఉందికానీమోదీ ప్రపంచం భిన్నంగా ఉంటుందిపేదమధ్య తరగతి ప్రజలు వెళ్లే రైల్వే స్టేషన్‌లో విమానాశ్రయం కంటే మెరుగైన సౌకర్యాలను కల‌్పిస్తానుఅందులో మన జోధ్‌పూర్ రైల్వేస్టేషన్‌ కూడా ఉంది.

సోదరులుసోదరిణులు,

ఈ రోజు ప్రారంభించిన రోడ్డురైలు ప్రాజెక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాయిరైలు మార్గాలను రెట్టింపు చేయటం వలన ప్రయాణ సమయం తగ్గిసౌకర్యం పెరుగుతుందిజైసల్మేర్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైలుమార్వార్-ఖంబ్లీ ఘాట్ రైలును ప్రారంభించే అవకాశం నాకు లభించిందికొన్ని రోజుల క్రితంవందే భారత్ రైలును కూడా నేను ప్రారంభించానుఇవాళ మూడు రహదారి ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన చేశానుజోధ్‌పూర్ఉదయ్‌పూర్ విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టెర్మినల్ నూతన భవనాలకు శంకుస్థాపన జరిగిందిఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయికొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయిఅంతేకాకరాజస్థాన్‌లో పర్యాటక రంగాన్ని పునరుత్తేజపరచటానికి కూడా దోహదపడతాయి.

మిత్రులారా,

వైద్యఇంజినీరింగ్ రంగంలో మన రాజస్థాన్ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందికోటా ప్రాంతం దేశానికి ఎంతోమంది వైద్యులనుఇంజినీర్లను అందించిందిమా ప్రయత్నం ఏటంటేరాజస్థాన్‌ను కేవలం విద్యా కేంద్రంగానే కాకవైద్యఇంజినీరింగ్ నైపుణ్యాల్లో కొత్త శిఖరాలను చేరుకునే ఒక నాణ్యతా కేంద్రంగా తీర్చిదిద్దటంఇందుకోసం జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ట్రామాఅత్యవసరక్రిటికల్ కేర్ కోసం అధునాతన సౌకర్యాల అభివృద్ధి జరుగుతోందిప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా జిల్లా ఆసుపత్రుల్లో కూడా క్రిటికల్ కేర్ బ్లాక్‌లు ఏర్పాటవుతున్నాయిజోధ్‌పూర్ ఎయిమ్స్జోధ్‌పూర్ ఐఐటీ వంటి సంస్థలు రాజస్థాన్‌లోనే కాకమొత్తం దేశంలోనే అగ్రగామి సంస్థలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది

ఎయిమ్స్ఐఐటీ జోధ్‌పూర్ సంస్థలు వైద్య సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలపై పని చేస్తున్నాయిరోబోటిక్ సర్జరీ వంటి హైటెక్ వైద్య సాంకేతికతలు పరిశోధనపరిశ్రమ రంగాల్లో భారత్ నూతన శిఖరాలను చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయిఇది వైద్యరంగంలోనూ పర్యాటకాన్ని పెంచుతుంది.

మిత్రులారా,

ప్రకృతినిపర్యావరణాన్ని ప్రేమించే వారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం రాజస్థాన్గురు జంభేశ్వర్బిష్ణోయ్ సమాజం శతాబ్దాలుగా ఈ జీవన విధానాన్ని పాటిస్తోందిఇవాళ ఈ జీవనశైలిని ప్రపంచమంతా అనుకరించాలని కోరుకుంటోందిఈ వారసత్వం ఆధారంగా నేడు యావత్ ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశం చేస్తోందిమన ప్రయత్నాలు వికసిత భారత్‌కు మూలమవుతాయని నేను విశ్వసిస్తున్నానురాజస్థాన్ అభివృద్ధి చెందినప్పుడే భారత్ కూడా అభివృద్ధి చెందుతుందిమనమంతా కలిసి రాజస్థాన్‌ను సుసంపన్నంగాఅభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలిఈ ప్రాధాన్యతతో ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నందున మీ సమాయాన్ని నేను ఎక్కువగా తీసుకోనుదీని తర్వాత నేను మరో ప్రాంతానికి వెళ్లాలిఅక్కడ వాతావరణంఉత్సాహంఉద్దేశ్యం భిన్నంగా ఉంటాయిమరికాసేపట్లో మిమ్మల్ని మరో ప్రాంతంలో కలుస్తాను

ధన్యవాదాలు!

 

***


(रिलीज़ आईडी: 2197455) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil