సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నలందాలో తవ్వకం పనులు.. సంరక్షణ
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:39PM by PIB Hyderabad
నలందాలో పురావస్తు తవ్వకం పనులతో పాటు సంరక్షణ పనులకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)కు తగినన్ని నిధుల్నీ, వనరుల్నీ ప్రభుత్వం సమకూరుస్తోంది.
తవ్వకం పనులతో పాటు సంరక్షణ పనులను చేపట్టడానికి ఏఎస్ఐకి అనుభవం కలిగిన బృందం ఉంది. తవ్వకం పనుల్లోనూ, సంరక్షణ లోనూ స్థానికులు పాలుపంచుకుంటుండడంతో వారికి ఉపాధి దొరుకుతోంది. దీంతో పాటు వారు తమ వారసత్వ పరిరక్షణలో పాలుపంచుకోవడానికి కూడా వీలు చిక్కుతోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న సంరక్షణ, పురావస్తు తవ్వకాల నేపథ్యంలో నలందా ఒక పర్యాటక ఆకర్షణ ప్రధాన కేంద్రంగా మారింది. నలందా 2010వ సంవత్సరం నుంచీ ప్రపంచ వారసత్వ స్థలంగా పేరుతెచ్చుకుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ లోక్‌సభకు ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2197014)
आगंतुक पटल : 7