56వ ఐఎఫ్ఎఫ్ఐలో భాగంగా ఏఐ-ఆధారిత చిత్రనిర్మాణంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన సినిమా ఏఐ హ్యాకథాన్-2025
సినిమా ఏఐ హ్యాకథాన్ 2025లో ఉత్తమ ఏఐ చిత్రంగా నిలిచిన మై రెడ్ క్రేయాన్
ప్రపంచస్థాయి ప్రతిభను ఆకర్షించిన సినిమా ఏఐ హ్యాకథాన్ 2025
48 గంటల ఛాలెంజ్‌లో 14 జట్ల పోటీ
వేవ్స్ ఫిల్మ్ బజార్ ఆధ్వర్యంలో నిర్వహించే సినిమా ఏఐ హ్యాకథాన్-2025... చిత్రనిర్మాణంలో కళ, సాంకేతికత, నైతికతల విజయవంతమైన కలయికను సెలబ్రేట్ చేస్తుంది. సృజనాత్మక అవుట్‌పుట్‌లో బాధ్యత, పారదర్శకత, ప్రామాణికతను కొనసాగిస్తూ... స్క్రిప్ట్ రైటింగ్, వీడియో జనరేషన్, ఎడిటింగ్, నిర్మాణం కోసం ఏఐ-ఆధారిత సాధనాలను ఉపయోగించి కథ చెప్పడంలోని హద్దులను అధిగమించడానికి ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను ప్రోత్సహిస్తుంది.
కీలకమైన సృజనాత్మక, సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఐదు అవార్డుల విజేతల వివరాలు:
1. ఆయుష్ రాజ్ దర్శకత్వం వహించిన టీం కల్పంక్ హిందీ భాషా చిత్రం ‘మై రెడ్ క్రేయాన్’ కి ఉత్తమ ఏఐ చిత్రం అవార్డును ప్రదానం చేశారు
2. కేయూర్ కాజవదర దర్శకత్వం వహించిన టీం అటామీస్ట్ ఆంగ్ల భాషా చిత్రం ‘రిమరీ’ కి అత్యంత వినూత్న ఏఐ యూజ్ అవార్డును ప్రదానం చేశారు.
3. సమరేష్ శ్రీవాస్తవ్, యాజ్ఞ ప్రియ గౌతమ్ జంటగా నటించిన సమరేష్ శ్రీవాస్తవ్ హిందీ భాషా చిత్రం ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ కి ఉత్తమ స్టోరీ టెల్లింగ్ అవార్డును ప్రదానం చేశారు.
4. సుమేష్ లాల్ దర్శకత్వం వహించిన టీం ఇండివుడ్, వండర్‌వాల్ మీడియా నెట్‌వర్క్ రూపొందించిన ఆంగ్ల భాషా చిత్రం ‘బీయింగ్’ కి ఉత్తమ విజువల్స్ అవార్డును ప్రదానం చేశారు.
5. రాజేష్ భోంస్లే దర్శకత్వం వహించిన ఆంగ్ల భాషా చిత్రం ‘మాన్‌సూన్ ఎకో’ కి ఉత్తమ సౌండ్-మ్యూజిక్ డిజైన్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ హ్యాకథాన్ రెండు దశల పూర్తి ఆన్‌లైన్ ఫార్మాట్‌ను అనుసరించింది. మొదటి దశలో భాగంగా గతంలో రూపొందించిన ఏఐ-ఆధారిత ఫిల్మ్ కంటెంట్‌ను (2–10 నిమిషాలు) సమర్పించడానికి వ్యక్తులు, బృందాలను (ఐదుగురు సభ్యుల వరకు) ఆహ్వానించారు.
2025, నవంబర్ 1 నుంచి నవంబర్ 12 వరకు ఈ ఎంట్రీలు స్వీకరించారు. 180కి పైగా సమర్పణలతో అద్భుత స్పందన లభించింది. ఎంపిక కమిటీలు క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తర్వాత 48 గంటల ఫైనల్ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి 14 జట్లను షార్ట్‌లిస్ట్ చేశారు.
రెండో దశలో పోటీదారుల కోసం "గుర్తుచేసుకున్న జ్ఞాపకాలు" అనే థీమ్ ఇచ్చారు. 60–120 సెకండ్ల సినిమాటిక్ కథను సృష్టించడం దీని లక్ష్యం, ఇది లోతైన వ్యక్తిగత జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకోవడానికి ఏఐని ఉపయోగిస్తుంది. వాస్తవికతను ఊహలతో మిళితం చేసి భావోద్వేగాలను పంచే కథనాన్ని అందిస్తుంది.
ఈ 48 గంటల ఈ ఛాలెంజ్ 2025, నవంబర్ 20న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటల నుంచి నవంబర్ 22 సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగింది.
జ్యూరీ ప్యానెల్ – సినిమా AI హ్యాకథాన్ 2025
జ్యూరీ ప్యానెల్‌లో ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్, దర్శక-నిర్మాత శ్రీ శేఖర్ కపూర్... దర్శక-నిర్మాత శ్రీ రామ్‌దాస్ నాయుడు... యానిమేటర్ డైరెక్టర్ శ్రీ అశ్విన్ కుమార్... ఇండియన్ సినిమా హెరిటేజ్ ఫౌండేషన్, ఫిల్మ్ హిస్టారిస్ట్ శ్రీమతి ఆశా బాత్రా... ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్-ఇంటరాక్టివ్ సర్వీసెస్ ఎల్‌టీఐఎమ్ఇండ్‌ట్రీ డాక్టర్ సుజయ్ సేన్... సీనియర్ డైరెక్టర్-డిజైన్ స్ట్రాటజీ, క్రాఫ్ట్ స్టూడియో, ఇంటరాక్టివ్ సర్వీసెస్, ఎల్‌టీఐఎమ్ఇండ్‌ట్రీ శ్రీ నయనా రౌత్... కమ్యూనికేషన్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఎల్‌టీఐఎమ్ఇండ్‌ట్రీ శ్రీమతి దిబ్యేందు హాల్దర్... చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఎల్‌టీఐఎమ్ఇండ్‌ట్రీ శ్రీమతి నేహా కతురియా ఉన్నారు.
పోటీదారులు ప్రదర్శించిన వాస్తవిక, సాంకేతిక నైపుణ్యం, భావోద్వేగాలను స్పష్టం చేస్తూ... తక్కువ సమయంలో నిర్మించిన ఈ చిత్రాల అసాధారణ నాణ్యత, సృజనాత్మకతలను జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది..
సినిమా ఏఐ హ్యాకథాన్ 2025 ఒక అద్భుత కార్యక్రమంగా చలనచిత్ర నిర్మాణంలో ఏఐ పరివర్తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది... తదుపరి తరం కథకులకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2194564
| Visitor Counter:
3