iffi banner

ఎప్పటికీ వయస్సు పెరగని బాలుడి కళ్ళ ద్వారా జాతి ఆత్మను ప్రతిబింబించిన ‘సాంగ్స్ ఆఫ్ ఆడమ్’


తరతరాలుగా అభిరుచులు గుర్తింపును ఎలా రూపొందిస్తున్నాయనే సార్వత్రిక సత్యాన్ని గ్రహించిన కే పాపర్

స్కిన్ ఆఫ్ యూత్: ట్రాన్స్‌జెండర్ గుర్తింపు, ప్రేమ, సామర్థ్యాల సమగ్ర చిత్రణ

 ‘సాంగ్స్ ఆఫ్ ఆడమ్’... ‘స్కిన్ ఆఫ్ యూత్’... ‘కే పాపర్’ చిత్రాల తారాగణం, సిబ్బంది తమ చిత్రాలను రూపొందించడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగత, సామాజిక, సాంస్కృతిక ప్రేరణల గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. కథ చెప్పడంలోని ప్రతిభను, చిత్రరూపకల్పనలోని సవాళ్లను, తెరపై ప్రాతినిధ్యం వహించే శక్తిమంతమైన గళాలను వారి విలేకరుల సమావేశం హైలైట్ చేసింది.

“సాంగ్స్ ఆఫ్ ఆడమ్”: ఒక మాయాజాల-వాస్తవిక జ్ఞాపకాల గీతం, పరివర్తన చెందుతున్న దేశం

సాంగ్స్ ఆఫ్ ఆడమ్ చిత్ర లోతైన సన్నిహిత మూలాలను సహ నిర్మాత అసమా రషీద్ పంచుకున్నారు. ఇది దర్శకుడి బాల్యంలో ఎదురైన నష్టాల నేపథ్యంతో మొదలై... సంవత్సరాల తరబడి సాగిన ప్రాజెక్ట్ అని తెలిపారు.

"మేం ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలకు పైగా పనిచేశాం. ఈ సినిమా దర్శకుడికి చాలా వ్యక్తిగతమైనది - అతను తన తాత మరణం తర్వాత 12 సంవత్సరాల వయస్సులో కలిగిన ఆలోచనలతో దీన్ని రూపొందించాడు," అని ఆయన తెలిపారు. మెసొపొటేమియా కథలకు  మంచి వనరులను అందిస్తుందన్నారు.  అక్కడి బాలుడికి కథకు మించి ఏమి జరుగుతుందో ఆయన వివరించారు. "ఈ కథనం ఇరాక్ అనుభవించిన సామాజిక పరివర్తనలను ప్రతిబింబిస్తుంది" అని అసనా వ్యాఖ్యానించారు.

అతని మాటలు సినిమాలోని భావోద్వేగాల లోతును ప్రతిబింబిస్తాయి. ఇందులో శాశ్వతత్వం, పురాణం, జాతీయ చరిత్ర ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

చిత్రం గురించి

ఇరాక్ | 2025 | అరబిక్ | 97’ | కలర్

సాంగ్స్ ఆఫ్ ఆడమ్ కథ 1946 మెసొపొటేమియా నేపథ్యంలో సాగుతుంది. 12 ఏళ్ల ఆడమ్ జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. అతను తన తాత సమాధిని చూసిన తర్వాత తాను ఎప్పటికీ పెరగనని ప్రతిజ్ఞ చేస్తాడు. విచిత్రంగా అందరూ వృద్ధాప్యంలోకి వచ్చినా అతను పిల్లవాడిగానే ఉండిపోతాడు. అతని తండ్రి శాపానికి భయపడి అతన్ని ఒంటరిని చేస్తాడు. అతని చుట్టూ ఉన్నవారు అతని శాశ్వత ఉనికిని గుర్తిస్తారు. 1950ల తిరుగుబాట్ల నుంచి సమకాలీన యుద్ధాల వరకు ఇరాక్ రాజకీయ తిరుగుబాట్లకు గురవుతున్నప్పుడు ఆడమ్ ఒక ఆధ్యాత్మిక గురువు అవుతాడు. మాయా-వాస్తవికతల ద్వారా ఈ చిత్రం అతని శాశ్వతమైన యవ్వనాన్ని ఒక దేశంతో పోలుస్తూ అన్వేషిస్తుంది. ఇది అతని జ్ఞాపకశక్తి, నష్టం, నిరంతర మార్పుల మధ్య స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాల హృదయ విదారకమైన రూపకం. 


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2025, #AnythingForFilms and #FilmsKeLiyeKuchBhi. Tag us @pib_goa on Instagram, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2194031   |   Visitor Counter: 5

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Odia , Kannada