విలేకరుల సమావేశంలో మెరిసిన జపాన్ కంట్రీ ఫోకస్ సినిమాలు ‘టైగర్’, ‘సీసైడ్ సెరెండిపిటీ’
ఇఫిలో మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్న ‘టైగర్’’, ‘సీసైడ్ సెరెండిపిటీ’ చిత్రాల బృందం
56వ జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫి) జపాన్ కంట్రీ ఫోకస్గా ఎంపికైంది. ఈ సందర్భంగా ప్రదర్శితమైన ‘టైగర్’, ‘సీసైడ్ సెరెండిపిటీ’ చిత్ర బృందాలు నేడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో పాల్గొన్నాయి. చిత్ర రూపకర్తలు తమ సృజనాత్మక ప్రయాణాలు, చిత్రాల నేపథ్యం, అంతర్జాతీయ వేదికపై జపాన్‌కు ప్రాతినిధ్యం వహించడంపై ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఏడాది కంట్రీ ఫోకస్ విభాగానికి జపాన్ ఎంపికవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్చలు కంట్రీ ఫోకస్ ప్రదర్శనకు విలువను మరింత పెంచాయి.
ఈ సమావేశంలో ముందుగా రెండు చిత్రాల ట్రైలర్లను ప్రదర్శించారు. ఆ తర్వాత, ‘టైగర్’ చిత్రం బృందం వేదికపైకి వచ్చి తమ చిత్రాన్ని మీడియాకు పరిచయం చేసింది.
"టైగర్" చిత్రం ఒక 35 ఏళ్ల మసాజ్ చేసే వ్యక్తి కథను వివరిస్తుంది. ఆస్తి హక్కుల విషయంలో తన సోదరితో పెరుగుతున్న వివాదం అతన్ని తీవ్రమైన మానసిక వేదనలోకి నెడుతుంది. ఈ పరిణామాలు అతన్ని నైతిక హద్దులను మసకబార్చే సిత్థికి తీసుకెళ్తాయి. ఎల్‌జీబీటీక్యూ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, గుర్తింపు, హక్కులు, సామాజిక ఆమోదం వంటి సమస్యలను వెలుగులోకి తెస్తుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అన్షుల్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాను రూపొందించేటప్పుడు ఎదుర్కొన్న సృజనాత్మక, భావోద్వేగపరమైన సంక్లిష్టతను గురించి వివరించారు. సున్నితమైన అంశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దానిపై తనకు మొదట్లో ఆందోళన ఉండేదని ఆయన వివరించారు. సాధారణ దర్శకుడిగా ఎల్‌జీబీటీక్యూ సమస్యలను తెరపైకి తీసుకురావడానికి బాధ్యత, సున్నితత్వం, వారిపై గౌరవం అవసరమని ఆయన పేర్కొన్నారు.
సీసైడ్ సెరెండిపిటీ చిత్ర నిర్మాత తోమోమి యోషిమురా తన అనుభవాలు, సృజనాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ.. భారతీయ ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆప్యాయత, ఉత్సాహం ఇఫిలో సినిమా ప్రదర్శనను ప్రత్యేకంగా అర్ధవంతంగా మార్చాయని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రం వెనుక ఉన్న ప్రధాన నేపథ్యం గురించి తోమోమి మాట్లాడుతూ.. పిల్లలు, పెద్దల మధ్య ఉన్న తరాల అంతరాన్ని తగ్గించడం ఈ కథ ముఖ్య లక్ష్యమని చెప్పారు. అన్ని వయసుల వారిలో అవగాహన పెంచేలా.. యువతతో పాటు పెద్దలకు కూడా ప్రత్యేక అనుభూతి కలిగే విధంగా చిత్రాన్ని మలిచామని తెలిపారు.
ప్రశాంతమైన సముద్రతీర పట్టణం నేపథ్యంలో రూపొందిన ‘సీసైడ్ సెరెండిపిటీ’ చిత్రం.. అక్కడ దీర్ఘకాలంగా నివసిస్తున్న ప్రజల జీవితాల్లోకి కళాకారుల రాకతో చోటుచేసుకునే విచిత్ర సంఘటనలతో వచ్చే మార్పులను చూపిస్తుంది. పాఠశాల విద్యార్థి సోసుకే, నిరంతరం మారుతున్న పట్టణాల చుట్టూ కథ నడుస్తుంది. పిల్లల సంకల్పాన్ని, పెద్దలు అర్థాన్ని వెతకడం వంటి జీవిత సత్యాలను చూపిస్తుంది. అసంపూర్ణమైనప్పటికీ, సున్నితమైన పాత్రలను చిత్రీకరిస్తూ, ఈ చిత్రం ప్రేమ, అనుబంధాన్ని వేడుకలా చూపిస్తుంది. ఈ చలనచిత్రోత్సవం పూర్తయ్యే వరకు ప్రేక్షకుల హృదయాల్లో ఈ కథ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభావంతుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు, రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమాహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2193878
| Visitor Counter:
11