‘ఇఫి’-2025లో 4వ రోజు: ‘భారత సంగీత.. నాట్య విన్యాసం: చిత్రమాలిక’.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సాంస్కృతిక బృందాల ఉర్రూతలూపే సంప్రదాయ వారసత్వ కళా ప్రదర్శన
గోవాలోని పణజి నగరంలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025 (ఇఫి)లో నాలుగో రోజు వైవిధ్యభరిత భారతీయ సంస్కృతీ ప్రదర్శనకు అంకితమైంది. ఈ మేరకు ఐనాక్స్ వేదిక ఓ సాంస్కృతిక కేంద్రంగా మారిపోయి- సంప్రదాయ జానపద నృత్య-సంగీత, రూపకాల ప్రదర్శనతో మారుమోగింది.
దేశం నలుమూలల నుంచి వచ్చిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) కళా బృందాలు ఐనాక్స్ వేదికపై ఉర్రూతలూగించే భారత జానపద సంప్రదాయ కళా ప్రతిభను ప్రదర్శించాయి. ప్రాంతీయ జానపద నృత్యగానాలతోపాటు ఉత్సాహభరిత రూపకాల అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. శక్తిమంతమైన సాంస్కృతిక భారతీయ ఆత్మచైతన్యాన్ని, వారసత్వాన్ని ఈ విరామ వినోద ప్రదర్శనలు ఘనంగా చాటిచెప్పాయి.

ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతం నుంచి ‘సీబీసీ' తాడియా జానపద కళాకారుల బృందం తమ నృత్యగానాలతో ‘ఇఫి-2025’కి ఉల్లాసభరిత హిమాలయాల స్ఫూర్తిని ప్రేక్షకులకు చేరువ చేసింది.

ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంత తాడియా జానపద కళాకారుల బృందం ప్రదర్శన దృశ్యాలు

అస్సాం నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల బృందం ప్రదర్శించిన ఆకర్షణీయ భోర్తల్ నృత్యం ‘ఇఫి-2025’లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇఫి-2025లో అస్సాం నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల బృందం భోర్తల్ నృత్య ప్రదర్శన.

ఇఫి-2025లో ఒరిశా రాష్ట్ర సుసంపన్న లయబద్ధ వారసత్వాన్ని చాటుతూ సీబీసీ కళాకారుల ఉల్లాసభరిత, ఉజ్వల సంబల్పురి జానపద నృత్య ప్రదర్శన

ఇఫి-2025లో ఒరిశా రాజధాని భువనేశ్వర్ నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల సంబల్పురి జానపద నృత్య ప్రదర్శన దృశ్యం.

ఇఫి-2025లో బీహార్‌లోని మిథిలా ప్రాంతం నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల జాఝియా జానపద నృత్య ప్రదర్శన.

ఇఫి-2025లో బీహార్‌లోని మిథిలా ప్రాంతం నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల జాఝియా జానపద నృత్య ప్రదర్శన.

ఇఫి-2025లో బీహార్‌లోని మిథిలా ప్రాంతం నుంచి వచ్చిన సీబీసీ కళాకారుల జాఝియా జానపద నృత్య ప్రదర్శన.

ఇఫి-2025లో హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోగల హట్టి గిరిజన తెగ వారి సంస్కృతిని, సామర్థ్యాన్ని చాటే విలక్షణ, ఉత్సాహభరిత సింహటూ నృత్యం.

తెలంగాణలో సంప్రదాయ వేషధారణ, సంక్లిష్ట శైలి, శక్తిమంతమైన సాంస్కృతిక ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన గుస్సాడి గిరిజన నృత్యం.

సంప్రదాయ వేషధారణ, సంక్లిష్ట నృత్య శైలి, శక్తిమంతమైన సాంస్కృతిక ప్రతిభతో తెలంగాణ గుస్సాడి గిరిజన కళాకారులు ప్రేక్షకులను సమ్మోహన పరిచారు.

సంప్రదాయ వేషధారణ, సంక్లిష్ట నృత్య శైలి, శక్తిమంతమైన సాంస్కృతిక ప్రతిభతో తెలంగాణ గుస్సాడి గిరిజన కళాకారులు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ఓలలాడించారు.

జమ్మూ నుంచి వచ్చిన డోగ్రీ నృత్య కళాకారులు ఆ ప్రాంత సాంస్కృతిక సంగీత మాధుర్యాన్ని, ఉల్లాసభరిత స్ఫూర్తిని పంచుతూ ‘ఇఫి-2025’ కళా ప్రాంగణానికి కొత్త వన్నెలద్దారు.

జమ్మూ ప్రాంత డోగ్రీ నృత్య కళాకారులు తమ సుసంపన్న సాంస్కృతిక సంగీత మాధుర్యాన్ని, ఉల్లాసభరిత స్ఫూర్తిని పంచి ప్రేక్షలకును ఆకట్టుకున్నారు.

జమ్మూ ప్రాంత డోగ్రీ నృత్య కళాకారులు తమ సుసంపన్న సాంస్కృతిక సంగీత మాధుర్యాన్ని, ఉల్లాసభరిత స్ఫూర్తిని పంచి ప్రేక్షలకును ఆకట్టుకున్నారు.

దమన్-దయ్యూ నుంచి వచ్చిన పీపుల్స్ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ కళాకారుల లయబద్ధ విన్యాసంతో మనోహర రాస్ జానపద నృత్య ప్రదర్శన!

తమిళనాడు జానపద నృత్య కళాకారులు ‘అడుక్కే కరగాట్టం’ ప్రదర్శనతో ఇఫి-2025 ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ నృత్యశైలిని ప్రదర్శించాలంటే అపార నైపుణ్యం, లయ అత్యంత అవశ్యం.

తమిళనాడు జానపద నృత్య కళాకారులు ‘అడుక్కే కరగాట్టం’ ప్రదర్శనతో ఇఫి-2025 ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఈ నృత్యశైలిని ప్రదర్శించాలంటే అపార నైపుణ్యం, లయ అత్యంత అవశ్యం.

తమిళనాడు జానపద నృత్య కళాకారులు ‘అడుక్కే కరగాట్టం’ ప్రదర్శనతో ఇఫి-2025 ప్రేక్షకులను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తారు. ఈ నృత్యశైలిని ప్రదర్శించాలంటే అపార నైపుణ్యం, లయ అత్యంత అవశ్యం.
***
रिलीज़ आईडी:
2193872
| Visitor Counter:
3