హోం మంత్రిత్వ శాఖ
దిగ్గజ సినీ నటుడు శ్రీ ధర్మేంద్ర మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం
ఆరు దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర మరణం దేశ సినీ పరిశ్రమకు తీరని లోటు
నటించే ప్రతి పాత్రకు జీవం పోసే కొద్దిమంది అరుదైన నటుల్లో ధర్మేంద్ర గారు ఒకరు.. తన కళా ప్రతిభతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు. తన నటన ద్వారా ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు
ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ… ఓం శాంతి శాంతి శాంతి
प्रविष्टि तिथि:
24 NOV 2025 3:57PM by PIB Hyderabad
ప్రముఖ సినీ నటుడు శ్రీ ధర్మేంద్ర మృతి పట్ల కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆరు దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో దేశంలోని ప్రతి పౌరుడి హృదయాన్ని తాకిన ధర్మేంద్ర గారి మరణం భారత సినిమా పరిశ్రమకు తీరని లోటని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. నటించే ప్రతి పాత్రకు జీవం పోసే కొద్దిమంది నటుల్లో ధర్మేంద్ర గారు ఒకరని.. తన కళా ప్రతిభతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. తన నటనతో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారన్నారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.
(रिलीज़ आईडी: 2193849)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam