ఐఎఫ్ఎఫ్ఐలో ఉత్సాహభరిత సంగీత, సాంస్కృతిక యాత్రను ప్రారంభించిన ఇఫీస్టా
దూరదర్శన్ ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం కావడం మా అదృష్టం: అనుపమ్ ఖేర్
కుటుంబాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వినోదాన్ని వేవ్స్ ఓటీటీ అందిస్తుంది: దూరదర్శన్ డీజీ
సంవత్సరాలుగా ఒక మామూలు చలనచిత్రోత్సవం స్థాయి నుంచి ఓ ఘనవైన వేడుకగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) అభివృద్ధి చెందుతూనే ఉంది. సినిమా, సంగీతం, జీవితాల మాయాజాలాన్ని ఒకచోట చేర్చే ఒక అద్భుత వినోద ప్రయాణంగా ఇది ముందుకు సాగుతోంది. గత సంవత్సరం ఈ సాంస్కృతిక ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఇఫీస్టా సగర్వంగా చేపట్టింది. సంగీతం, కళలను ఇఫి ప్రయాణంతో జతచేసింది.
గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిన్న సాయంత్రం దూరదర్శన్, వేవ్స్ ఓటీటీలు నిర్వహించిన ఇఫీస్టా ప్రారంభోత్సవం ద్వారా ఐఎఫ్ఎఫ్ఐ 56వ ఎడిషన్... సంగీతం, సంస్కృతి, లైవ్ ప్రదర్శనల ద్వారా మనస్సును ఆహ్లాదపరిచే తన అద్భుత సాంప్రదాయాన్ని కొనసాగించింది.
నక్షత్రాలతో మెరిసిపోయే చల్లని సాయంత్రం వేళ ప్రముఖ కళాకారులంతా తమ నైపుణ్యాల వెలుగులను పంచుతూ వేదికను అలంకరించారు. వారిలో గౌరవనీయ నటుడు శ్రీ అనుపమ్ ఖేర్, ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎం ఎం కీరవాణి, అస్సాంకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, నటి ఐమీ బారుహ్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రవి కొట్టారకర, దక్షిణ కొరియాకు చెందిన మనోహరమైన స్వరం ఎం పి జేవోన్ కిమ్ తదితరులు ఉన్నారు. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ శ్రీ కె. సతీష్ నంబూద్రిపాద్‌తో కలిసి వారు సినిమా మాయాజాల వేడుకల కోసం సమావేశమయ్యారు.
డీజీ శ్రీ నంబూద్రిపాద్ తన ప్రారంభోపన్యాసంలో... “ఉపగ్రహ విప్లవం ఫలితంగా ఏర్పడిన వంశపారంపర్య ఛానల్ ప్రజలు ఎప్పుడైనా కార్యక్రమాలను చూడగలిగేలా చేతిలో ఇమిడిపోయే పరికరాలతో నెమ్మదిగా డిజిటల్ విప్లవానికి దారి తీస్తోందని మనందరికీ తెలుసు. డిమాండ్‌కు అనుగుణంగా దూరదర్శన్ అభివృద్ధి చెందడం సముచితం. వేవ్స్ ఓటీటీతో కొత్త డిజిటల్ దశలోకి ప్రవేశించడం ద్వారా దూరదర్శన్ సరైన పనిచేస్తోంది. వేవ్స్ ఓటీటీ కుటుంబాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది.” అని అన్నారు. “డిజిటల్ పరికరాలకు అతుక్కుపోతున్న జనరేషన్ జీ యువతరం... దూరదర్శన్ ప్రాతినిధ్యం వహించిన లేదా ప్రాతినిధ్యం వహించే వారసత్వ బలాన్ని చూడటానికి దూరదర్శన్‌కు రావాలని మేం అభ్యర్థిస్తున్నాం.” అని కోరారు.
అనంతరం శ్రీ ఖేర్ ఇఫీస్టా వేదికపై తన గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ... "మనమంతా దూరదర్శన్ ద్వారా మన సినీ జీవితాన్ని ప్రారంభించాం. దూరదర్శన్ మనల్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం మన అదృష్టం. నేనూ దూరదర్శన్ వల్లే ఈ రంగానికి వచ్చాను... ఎన్నిటికీ దానిని నేను మర్చిపోలేను. దూరదర్శన్ మన జీవితాల్లో నిలిచి ఉండే పరిమళం... ఎప్పటికీ మనల్ని కౌగిలితో పెనవేసుకుని ఉంటుంది." అన్నారు.
ఇరు దేశాల మధ్య స్వర వారధిగా నిలుస్తూ... ధక్షిణ కొరియాకు చెందిన జేవోన్ కిమ్ అద్భుత వందేమాతర గేయాలాపనతో వేడుక ప్రారంభమైంది. "నేను ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్- కొరియా మధ్య సినిమాలు, కంటెంట్ సహకారం కోసం నేను హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నాను" అని ఆమె గేయం ఆలపించడానికి ముందు వ్యాఖ్యానించారు.
తరువాత ప్రముఖ గాయకులు-గేయ రచయిత ఓషో జైన్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇచ్చారు.
తర్వాత ఏమిటి: మరో మూడు సాయంకాలాల వేడుకలు
ఇఫీస్టా-2025లో నవంబర్ 22-24 తేదీల్లో జరగనున్న మిగిలిన మూడు సాయంత్రాలు ఉచిత ప్రవేశంతో పాటు పలు ఫీచర్లను అందిస్తాయి:
2వ రోజు (నవంబర్ 22) – నీతూ చంద్ర, నిహారిక రైజాదా హోస్ట్ చేస్తారు
• బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్... ది బాండిట్స్ (ఇండియా), బీట్స్ ఆఫ్ లవ్ (ఇంటర్నేషనల్), ఇషా మాల్వియా హోస్ట్ చేస్తారు.
• సురోన్ కా ఏకలవ్య ప్రతిభా సింగ్ బఘెల్‌తో పాటు, అతిథి ప్రదర్శన కారులు జాక్ అస్లాం, సుప్రియా పాథక్, రాహుల్ సోనీ, ప్రతీక్షా దేఖా, పికోసా మొహర్కర్‌లతో సెగ్మెంట్
***
Release ID:
2193012
| Visitor Counter:
4