ప్రధాన మంత్రి కార్యాలయం
నాలుగు కార్మిక నియమావళుల అమలును స్వాగతించిన ప్రధానమంత్రి
స్వాతంత్య్రం అనంతరం అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఇదొకటి.. వ్యాపార సౌలభ్యానికి ప్రోత్సాహం: ప్రధానమంత్రి
సార్వత్రిక సామాజిక భద్రతకు బలమైన పునాదిగా నిలుస్తాయి: ప్రధానమంత్రి
కార్మికుల హక్కులను కాపాడుతూ, దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే భవిష్యత్తుకు సిద్ధమైన వ్యవస్థ నిర్మాణం:ప్రధానమంత్రి
ఉపాధి అవకాశాలు, ఉత్పాదకతను మెరుగుపరిచి, వికసిత్ భారత్ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేయనున్న సంస్కరణలు: ప్రధానమంత్రి
Posted On:
21 NOV 2025 5:00PM by PIB Hyderabad
నాలుగు కార్మిక చట్టాల నియమావళుల అమలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. స్వాతంత్య్రం తర్వాత అత్యంత సమగ్ర, ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఒకటిగా వీటిని అభివర్ణించారు. ఈ సంస్కరణలు కార్మికులను మరింత శక్తిమంతం చేస్తూ, నియమాలను పాటించే ప్రక్రియలను సులభం చేసి, ‘వ్యాపార సౌలభ్యాన్ని’ ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు.
ఈ నాలుగు కార్మిక నియమావళులు సార్వత్రిక సామాజిక భద్రతకు, కనీస-సకాలంలో వేతనాల చెల్లింపునకు, సురక్షితమైన కార్యాలయాలకు, ప్రజలకు ముఖ్యంగా నారీ శక్తి, యువ శక్తికి.. లాభదాయకమైన అవకాశాలకు బలమైన పునాదిగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ సంస్కరణలు కార్మికుల హక్కులను పరిరక్షించే, భారతదేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే భవిష్యత్తుకు సిద్ధమైన వ్యవస్థను నిర్మిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఇవి ఉపాధి కల్పన, ఉత్పాదకతను పెంచుతాయని, వికసిత్ భారత్ వైపు దేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా అన్నారు..
‘‘శ్రమేవ జయతే!
మన ప్రభుత్వం నేడు నాలుగు కార్మిక నియమావళులను అమలులోకి తెచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక-ఆధారిత సంస్కరణలలో ఒకటి. మన కార్మికులకు గొప్ప అధికారాన్ని అందిస్తుంది. కార్మికుల సమ్మతిని గణనీయంగా సులభతరం చేయడంతోపాటు ‘వ్యాపార సౌలభ్యాన్ని’ ప్రోత్సహిస్తుంది’’
‘‘ఈ చట్టాలు సార్వత్రిక సామాజిక భద్రతకు, కనీస, సమయానికి వేతనాల చెల్లింపునకు, సురక్షితమైన పనిస్థలాలకు, ప్రజలకు,ముఖ్యంగా నారీ శక్తి, యువ శక్తికి లాభదాయకమైన అవకాశాలకు బలమైన పునాదిగా వ్యవహరిస్తాయి’’
‘‘ఈ సంస్కరణలు కార్మికుల హక్కులను రక్షిస్తూ భారత ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే భవిష్యత్తుకు సిద్ధమైన ఓ వ్యవస్థను నిర్మిస్తుంది. ఇవి ఉద్యోగ కల్పనను, ఉత్పాదకతను మెరుగుపరిచి, వికసిత్ భారత్ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి’’
***
(Release ID: 2193011)
Visitor Counter : 4
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam