ఐఎఫ్ఎఫ్ఐ రెండో రోజు: మాస్టర్‌క్లాస్‌లు, రౌండ్‌టేబుల్స్, నైపుణ్య ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక సామర్థ్యం ప్రదర్శన
ప్రపంచ సినిమా ఎక్స్ఛేంజీ, కొత్తగా వస్తున్న ప్రతిభావంతుల ప్రదర్శనలు, ఉన్నత స్థాయి దౌత్యవేత్తల సంప్రదింపులు, సాంస్కృతిక సంభాషణలకు ఐఎఫ్ఎఫ్ఐ-2025లో రెండో రోజు సాక్ష్యంగా నిలిచింది. మాస్టర్‌క్లాస్ సిరీస్ ప్రారంభం, రేపటి సృజనాత్మక మేధస్సు- 2025 (సీఎంఓటీ- క్రియేటీవ్ మైండ్స్ ఆఫ్ టుమారో) ప్రారంభం, దౌత్యవేత్తల రౌండ్‌టేబుల్, సినిమా సంభాషణ, తారలు మెరుపులతో కూడిన రెడ్ కార్పెట్ వంటి విశేషాలకు ఇవాళ్టి ఐఎఫ్ఎఫ్ఐ వేదికైంది. ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంగా ఐఎఫ్ఎఫ్ఐకి పెరుగుతున్న ప్రతిష్టను ఇవి తెలియజేశాయి.
IFFI 2025 మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను ప్రారంభించిన డాక్టర్. ఎల్. మురుగన్
సీనియర్ అధికారులు, ప్రముఖ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గోవాలోని కళా అకాడమీలో మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను కేంద్ర సమాచార - ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ ప్రారంభించారు.
మొదటిసారిగా ఈ ప్రారంభోత్సవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు చేరుకోవాలన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, కెనడా నుంచి ఆహ్వానితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోవాలోని కళా అకాడమీలో జ్యోతిని వెలిగించి ఐఎఫ్ఎఫ్ఐ- 2025 మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్
సమాచార- ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జజు, చలనచిత్ర నిర్మాత శ్రీ ముజఫర్ అలీ, ఇతర ప్రముఖుల సమక్షంలో 56వ ఐఎఫ్ఎఫ్ఐలో జ్యోతిని వెలిగించి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్

గోవా ఐఎఫ్ఎఫ్ఐ- 2025లోని మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో మాట్లాడుతున్న సమాచార - ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జజు

గోవాలో జరుగుతున్న 56వ ఐఎఫ్ఎఫ్ఐలోని మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో కేంద్ర సహాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్, సమాచార - ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జజు, చలనచిత్ర నిర్మాత శ్రీ ముజఫర్ అలీ, ఇతర ప్రముఖులు

సీఎంఓటీ 2025 ప్రారంభం: 48 గంటల చలనచిత్ర సవాలులో 125 మంది యువ సృజనకర్తల పోటీ

రేపటి సృజనాత్మక మేధస్సులు- 2025 (సీఎంఓటీ) ఐదో విడత ప్రారంభమైంది. ఇందులో 125 మంది వర్ధమాన చలనచిత్ర నిర్మాతలు ఒక 48-గంటల చలనచిత్ర సవాలులో పాల్గొంటున్నారు.
కళను మెరుగుపరచుకోవడానికి అధిక ఒత్తిడితో కూడిన ఈ వాతావరణాన్ని పాల్గొంటున్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎల్. మురుగన్ సూచించారు. ఈ సందర్భంగా భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, తదుపరి తరం ప్రతిభావంతులకు మద్దతునిచ్చేందుకు ఉద్దేశించిన ముంబయిలోని భారత సృజనాత్మక సాంకేతికత సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివి టెక్నాలజీస్) వంటి వాటిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
భవిష్యత్ చలనచిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎంఓటీ-2025ను కార్యదర్శి శ్రీ సంజయ్ జజుతో కలిసి ప్రారంభించిన సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్

సీఎంఓటీ- 2025 ప్రారంభమౌతున్న సందర్భంగా ఒక చోట చేరిన అభిరుచి గల ప్రతిభావంతులు

సీఎంఓటీ 2025: భవిష్యత్తు చలనచిత్ర రూపకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్

రెడ్-కార్పెట్ విభాగం: తారల ఆకర్షణ- ప్రేక్షకుల ఆదరణ

రెడ్-కార్పెట్ విభాగం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవం

లో సినిమా ప్రముఖులు గాలా సిని ప్రదర్శనలకు హాజరయ్యారు. ప్రేక్షకులను చలనచిత్ర రూపకర్తలతో కలిపేందుకు రూపొందించిన ఈ విభాగం.. ప్రపంచ, ఆసియా, భారత చలనచిత్రాలను ప్రదర్శించింది. ఇది ఉత్సవానికి శోభను, ఉల్లాసాన్ని తీసుకొచ్చింది.

గోవా ఐఎఫ్ఎఫ్ఐ-2025 రెడ్ కార్పెట్‌పై గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్

గోవా ఐఎఫ్ఎఫ్ఐ-2025 రెడ్ కార్పెట్‌పై అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్ తదితర ప్రముఖులు

గోవా ఐఎఫ్ఎఐ-2025 రెడ్ కార్పెట్‌పై మనోజ్ బాజ్‌పాయ్, ది ఫ్యామిలీ మ్యాన్ చిత్ర బృందం

గోవాలో జరుగుతున్న 56వ ఐఎఫ్ఎఫ్ఐ రెడ్ కార్పెట్‌పై చలనచిత్ర నిర్మాత ముజఫర్ అలీ

ఐఎఫ్ఎఫ్ఐ రాయబారులు రౌండ్‌టేబుల్‌లో సహ-నిర్మాణ సామర్థ్యాన్ని తెలియజేసిన భారత్
సహ- నిర్మాణం, సాంకేతిక భాగస్వామ్యాలు, చట్టపరమైన నిబంధనలను సులభతరం చేసే విషయంలో మెరుగైన సహకారాన్ని సాధించేందుకు రాయబారుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రపంచ చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా భారత్ ఎదుగుతోందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జజు ప్రధానంగా తెలియజేశారు. సహ- నిర్మాణం అనేది దృశ్య శ్రవణ సహకారానికి ఒక కీలకమైన ఆధారమని డాక్టర్ మురుగన్ అన్నారు.
మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో పాటు వీఎఫ్ఎక్స్, యానిమేషన్, పైరసీ నిరోధక చర్యల్లో పురోగతి సాధిస్తుండటంతో 2025 నాటికి భారత మీడియా, వినోద రంగం 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా ఉందని డాక్టర్ మురుగన్ తెలిపారు.
గోవా ఐఎఫ్ఎఫ్ఐ-2025లో జరిగిన సహ- నిర్మాణ మార్కెట్ రాయబారులు రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్న సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జజు

గోవా ఐఎఫ్ఎఫ్ఐ-2025లో సహ-నిర్మాణంపై రాయబారుల రౌండ్‌టేబుల్ సమావేశం

ఐఎఫ్ఎఫ్ఐలో ‘సినిమా, సంస్కృతి: రెండు తరాల అవలోకనం’ అంశంపై చర్చ

ముజఫర్ అలీ, షాద్ అలీలతో జరిగిన ఈ సెషన్‌ను షాద్ అలీ సమన్వయం చేశారు. ఇది పలు తరాల భారతీయ సినిమాపై లోతైన పరిశీలను అందించింది.
ఈ చర్చ ప్రారంభంలో ఇరువురికి రవి కొట్టారకర సన్మానం చేశారు. జ్ఞాపకాలు, సృజనాత్మకత, మారుతోన్న కళాత్మక పద్ధతులపై చర్చ కొనసాగింది.

ఐఎఫ్ఎఫ్ఐలో ‘సినిమా, సంస్కృతి: రెండు తరాల అవలోకనం’ అనే సెషన్‌లో పాల్గొన్న ముజఫర్ అలీ, షాద్ అలీ

ఏఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన క్లాసిక్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహిస్తున్న ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
***
Release ID:
2192989
| Visitor Counter:
3