ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలకూ, ఆటగాళ్లకూ అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
21 NOV 2025 2:22PM by PIB Hyderabad
కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలందరితో పాటు, ఆ పోటీలో పాలుపంచుకున్న వారికి కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలనూ, శుభాకాంక్షలనూ తెలియజేశారు.
దీనిలో పాల్గొన్న యువ భాగస్వాములు కనబరిచిన శక్తి, ఉత్సాహం నిజంగా అద్భుతమైనవని శ్రీ మోదీ ప్రశంసించారు. ఆట ద్వారా సత్తానీ, నైపుణ్యాన్నీ గొప్పగా ప్రదర్శించారని ఆయన అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘కాశీ ఎంపీ క్రీడల పోటీలో విజేతలకూ, ఈ పోటీలో పాల్గొన్న అందరికీ అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు. దీనిలో పాలుపంచుకున్న యువ సహచరులు చూపిన శక్తి, ఉత్సాహం అద్భుతంగా ఉన్నాయి. వారు తమ సత్తానీ, నైపుణ్యాన్నీ గొప్పగా ప్రదర్శించారు’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2192670)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam