ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు- 2025 ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
19 NOV 2025 10:42PM by PIB Hyderabad
తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025 ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఎప్పటిలాగే, కోయంబత్తూరులో నాకు లభించిన స్వాగతం ఎంతో ప్రత్యేకమైనది. శక్తిమంతమైన ఈ నగర ప్రజల ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఆశీస్సులు నాకు అపురూపమైనవి"
"గడిచిన 11 ఏళ్లలో భారత వ్యవసాయ రంగంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. వ్యవసాయ రంగంలో యువత ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవటం. ఈ పరివర్తనలో సేంద్రియ వ్యవసాయానిది కీలక పాత్ర"
"కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది"
"తమిళనాడుతో పాటు దక్షిణ భారత రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు యావద్దేశానికి స్ఫూర్తిదాయకం"
"ప్రకృతి వ్యవసాయం శాస్త్రీయ ఆధారిత ఉద్యమంగా మారేందుకు మనమంతా కృషి చేయాలి. ఇందుకోసం నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను"
"కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు- 2025 ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రకృతి వ్యవసాయంపై చర్చలను, మేలైన పద్ధతులను పంచుకోవటాన్ని ఇది ప్రోత్సహిస్తోంది. ఈ రంగంలో రైతులు చేస్తున్న వినూత్న ప్రయత్నాలు చూడటం ఆనందంగా ఉంది"
***
(Release ID: 2191966)
Visitor Counter : 9