రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

6వ జాతీయ జల అవార్డులు, జల్ సంచయ్-జన్ భాగీదారీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి


వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారానే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Posted On: 18 NOV 2025 2:06PM by PIB Hyderabad

ఇవాళ (నవంబర్ 18, 2025) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో 6వ జాతీయ జల అవార్డులుజల్ సంచయ్-జన్ భాగీదారీ అవార్డులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

 

నదీ పరివాహక ప్రాంతాలుసముద్ర తీర ప్రాంతాలునీటి లభ్యత ఉన్న ప్రాంతాల చుట్టూనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి అన్నారునదులుచెరువుల వంటి నీటి వనరులను గౌరవించటం మన సంస్కతి అని చెప్పారుమన జాతీయ గేయంలోనూ బంకించంద్ర చటర్జీ రాసిన మొదటి పదం సుజలాం అనే.. దాని అర్థం నీటి వనరులు సమృద్ధిగా కలది అనిమనదేశం నీటికి ఇస్తున్న ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన నీటి వినియోగం తప్పనిసరనిమనదేశంలో నీటి యాజమాన్యం అత్యవసరమని రాష్ట్రపతి తెలిపారుఎందుకంటే భారత్‌లో జనాభాతో పోల్చితే నీటి వనరులు తక్కువగా ఉన్నాయని వెల్లడించారుతలసరి నీటిలభ్యత అతిపెద్ద సవాలన్నారువాతావరణ మార్పులు జల చక్రాన్ని ప్రభావితం చేస్తున్నాయనీఇలాంటి పరిస్థితుల్లో నీటి లభ్యతనీటి భద్రతకు.. ప్రభుత్వంప్రజలు కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.

 

గతేడాది ప్రారంభించిన జల్ సంచయ్-జన్ భాగీదారీ కార్యక్రమం ద్వారా 35 లక్షల ఇంకుడు గుంతలను నిర్మించటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.

పునరావృత నీటి ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమలుఇతర నీటి వినియోగదారులు జల వనరులను సమర్థంగా వాడుకోవచ్చని రాష్ట్రపతి తెలిపారునీటి శుద్ధిపునర్వినియోగం ద్వారా పరిశ్రమలు ద్రవ వ్యర్థాలను విడుదల చేయటం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారుఈ ప్రయత్నాలు నీటి నిర్వహణసంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలుజిల్లా పాలనా విభాగాలుమున్సిపాలిటీలుగ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సంరక్షణస్థిరమైన నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రపతి స్పష్టం చేశారుఎన్నో విద్యాసంస్థలుప్రజా సంఘాలుప్రభుత్వేతర సంస్థలు ఈ దిశగా తమ వంతు సహకారం అందించటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారునీటి వాడకాన్ని తగ్గించిఉత్పత్తిని పెంచే వినూత్న విధానాలను అవలంబించాలని రైతులుపారిశ్రామికవేత్తలకు సూచించారుస్వచ్ఛందంగా ముందుకు వచ్చే బాధ్యతాయుతమైన పౌరులు నీటి సంరక్షణలో కీలకమని ఆమె చెప్పారువ్యక్తులుకుటుంబాలుసమాజంప్రభుత్వ భాగస్వామ్యం ద్వారానే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందన్నారు.

నీటిని ఉపయోగిస్తున్నప్పుడువిలువైన ఆస్తిని వినియోగిస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని రాష్ట్రపతి అన్నారుగిరిజన ప్రజలు నీటితో పాటు అన్ని సహజ వనరులను ఎంతో గౌరవిస్తారని తెలిపారుఅత్యంత సమర్థవంతమైన నీటి నిర్వహణ ప్రజల జీవన విధానంలో కీలక భాగం కావాలని ఆమె స్పష్టం చేశారువ్యక్తిగతంగానూసమూహంగానూ నీటి సంరక్షణకు నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారుదేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెంచేలా నీటి అవగాహన కల్పించటం అత్యవసరమని చెప్పారునీటిని సేకరించిసంరక్షించటం ప్రజల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.

నీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటంఉత్తమ నీటి వినియోగ పద్ధతులను పాటించేలా ప్రోత్సహించటమే జాతీయ జల అవార్డుల లక్ష్యంప్రజల భాగస్వామ్యంవనరుల సమీకరణ ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంచటానికి వైవిధ్యమైనవిస్తరించగలిగేపునర్వినియోగించగలిగే నమూనాల రూపకల్పనకు జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్ జేబీకార్యక్రమం ఉపయోగపడుతుంది.

Please click here to see the President's Speech-

 

***


(Release ID: 2191260) Visitor Counter : 11