మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ గోపాల్ రత్న పురస్కారాల ప్రకటన


ఈ నెల 26న జాతీయ పాల దినోత్సవ కార్యక్రమాల్లో సత్కారం

అత్యుత్తమ - పాడి రైతు, పాడి సహకార సంఘం, ఎఫ్‌పీసీ, ఎంపీసీలకు అవార్డులు

మొదటి బహుమతి విజేతకు రూ.5 లక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2025 1:17PM by PIB Hyderabad

జాతీయ గోపాల్ రత్న అవార్డులు (ఎన్‌జీఆర్ఏ)- 2025 విజేతల పేర్లను మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలో భాగమైన పశు సంవర్ధక, పాడి విభాగం ప్రకటించింది. పశుగణం, పాడి రంగంలో అత్యున్నత జాతీయ స్థాయి పురస్కారాల్లో ఎన్‌జీఆర్ఏ ఒకటి. ఈ అవార్డులను మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ (ఎంఓఎఫ్ఏహెచ్‌డీ) కేంద్ర మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ప్రదానం చేస్తారు. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్‌తో పాటు శ్రీ జార్జి కురియన్ కూడా పాల్గొంటారు. ఈ పురస్కారాలను ఈ నెల 26న జాతీయ పాల దినోత్సవాల్లో భాగంగా అందిస్తారు. ఈ సంవత్సరం మొత్తం 2,081 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో నుంచి పురస్కార విజేతలను ఎంపిక చేశారు.

ప్రతి కేటగిరీలో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:

క్రమ సంఖ్య

కేటగిరీ

ర్యాంకు సహా ఎన్‌జీఆర్ఏ-2025 విజేతలు

 

 

 

1.

దేశవాళీ పశువులు, ఎద్దు జాతులను పెంచుతున్న అత్యుత్తమ పాడి రైతు

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు - శ్రీ అరవింద్ యశ్వంత్ పాటిల్, కొల్హాపూర్, మహారాష్ట్ర.

2వ ర్యాంకు - డాక్టర్ కంకణాల కృష్ణారెడ్డి, హైదరాబాద్, తెలంగాణ.

3వ ర్యాంకు - శ్రీ హర్షిత్ ఝురియా, సీకర్, రాజస్థాన్.

3వ ర్యాంకు- కుమారి శ్రద్ధ సత్యవాన్ ధవన్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర.


 

ఈశాన్య ప్రాంతాల వారు, హిమాలయ ప్రాంతాల వారు

  • శ్రీమతి విజయ్ లత, హమీర్‌పూర్, హిమాచల్ ప్రదేశ్.

  • శ్రీ ప్రదీప్ పాన్‌గరియా, చంపావత్, ఉత్తరాఖండ్.

2.

ఉత్తమ పాడి సహకార సంఘం, పాల ఉత్పత్తిదారు వాణిజ్య సంస్థ, డెయిరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు - మీనన్ గాడి క్షీరోత్పాదక సహకార సంఘం, వయనాడ్, కేరళ.

2వ ర్యాంకు - కున్నంకాట్టుపతి క్షీరోత్పాదక సహకార సంఘం, పాలక్కడ్, కేరళ.

2వ ర్యాంకు - ఘినోయి దుగ్ధ్ ఉత్పాదక సహకార సమితి, జైపూర్, రాజస్థాన్.

3వ ర్యాంకు - టీవైఎస్‌పీఎల్ 37 సెందూరై మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అరియలూర్, తమిళనాడు 

ఈశాన్య ప్రాంతాల వారు, హిమాలయ ప్రాంతాల వారు:

  • కుల్హా దూద్ ఉత్పాదక్ సహకార సమితి, ఉధాం సింగ్ నగర్, ఉత్తరాఖండ్.

3.

 

 

కృత్రిమ గర్భధారణ ప్రక్రియ- అత్యుత్తమ నిపుణుడు

ఈశాన్య ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల వారు:

1వ ర్యాంకు - శ్రీ దిలీప్ కుమార్ ప్రధాన్, అనుగుల్, ఒడిశా.

2వ ర్యాంకు - వికాస్ కుమార్, హనుమాన్‌గఢ్, రాజస్థాన్.

3వ ర్యాంకు - శ్రీమతి అనురాధ చాకలి, నంద్యాల, ఆంధ్రప్రదేశ్.


 

ఈశాన్య ప్రాంతాల వారు, హిమాలయ ప్రాంతాల వారు:

  • శ్రీ దిలువార్ హసన్, బార్పేట, అస్సాం.

 

ఎన్‌జీఆర్ఏ-2025లో మొదటి రెండు కేటగిరీలు... అత్యుత్తమ పాడి రైతు, అత్యుత్తమ డీసీఎస్, లేదా ఎఫ్‌పీఓ, లేదా ఎంపీసీకి.. ప్రశంస పత్రాన్నీ, జ్ఞాపికనీ, నగదు బహుమతినీ ఈ కింద పేర్కొన్న విధంగా అందజేస్తారు:

  • ఒకటో ర్యాంకుకు రూ.5 లక్షలు

  • రెండో ర్యాంకుకు రూ.3 లక్షలు

  • మూడో ర్యాంకుకు రూ.2 లక్షలు

  • ఈశాన్య ప్రాంతం (ఎన్ఈఆర్) లేదా హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక అవార్డుగా రూ.2 లక్షలు.

  • కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో అత్యుత్తమ నిపుణుల కేటగిరీలో జాతీయ గోపాల్ రత్న పురస్కారం-2025 కింద ఒక ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను ఇస్తారు. ఈ కేటగిరీలో నగదు బహుమతిని ఇవ్వరు.

నేపథ్యం

రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం)ను 2014 డిసెంబరులో ప్రారంభించారు. దీనిలో భాగంగా దేశవాళీ గోజాతుల శాస్త్రీయ సంరక్షణ, అభివృద్ధి ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పాల ఉత్పత్తిని చేపడుతున్న రైతులనూ, పాడి సహకార సంఘాలనూ, ఎంపీసీలనూ, ఎఫ్‌పీఓలతో పాటు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన నిపుణులనూ ప్రోత్సహించడానికి ఏటా జాతీయ గోపాల్ రత్న పురస్కారాలను (ఎన్‌జీఆర్ఏ) 2021 నుంచీ బహూకరిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2191028) సందర్శకుల సూచీ సంఖ్య : : 112
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Malayalam