మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు సౌదీ అరేబియాలోని మదీనా దగ్గర నిన్న రాత్రి ప్రమాదం...
24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమును ఏర్పాటు చేసిన
జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయం
దౌత్యాధికారులతో మాట్లాడుతున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ ప్రకటన
బాధితులకు అవసరమైన సహాయం… పూర్తి వివరాల సేకరణ: మంత్రి
Posted On:
17 NOV 2025 12:30PM by PIB Hyderabad
ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు నిన్న రాత్రి సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలో 24 గంటలూ పనిచేసే ఒక కంట్రోల్ రూమును జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులు ఈ కష్టకాలంలో మనోనిబ్బరంతో ఉండాలని ఆయన ప్రార్థించారు.
అవసరమైన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు:
8002440003 (టోల్ ఫ్రీ),
00966122614093, 00966126614276
00966556122301 (వాట్సాప్).
ప్రమాదంపై మరిన్ని వివరాలను సేకరించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలను తీసుకుంటున్నామనీ, మన రాయబారి కార్యాలయం ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ రిజిజూ తెలిపారు. సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖతోనూ, ఇతర స్థానిక అధికారులతోనూ రియాద్ లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని దౌత్య కార్యాలయం సంప్రదిస్తున్నాయి. వివిధ ఆసుపత్రుల్లోనూ, సంబంధిత ప్రదేశాల్లోనూ భారతీయ సమాజ సేవకులు, దౌత్య సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రియాద్ లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని దౌత్య కార్యాలయం అన్ని రకాల సహాయాన్నీ అందిస్తున్నాయి. సంబంధిత కుటుంబాలతో సమన్వయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భారత రాయబార, దౌత్య కార్యాలయాల అధికారులు మాట్లాడుతున్నారు.
***
(Release ID: 2191024)
Visitor Counter : 2