మీడియాకు చివరి అవకాశం: నవంబర్ 17 అర్థరాత్రి వరకు అందుబాటులో 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) మీడియా అక్రిడిటేషన్ పోర్టల్
మీడియా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున అందిన విజ్ఞప్తుల దృష్ట్యా, 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) మీడియా అక్రిడిటేషన్ పోర్టల్‌ను ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి మరో మూడు రోజుల పాటు తిరిగి అందుబాటులో ఉంచుతారు. దీని ద్వారా, ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఈ సినీ ఉత్సవ విశేషాలను ప్రజలకు అందించే ఆసక్తిగల జర్నలిస్టులు మీడియా ప్రతినిధులుగా నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
అధికారిక పోర్టల్ https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx ద్వారా ఇప్పుడే నమోదు చేసుకోండి.
56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని పనాజీలో జరుగుతుంది. అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు క్రింది విభాగాలలో ప్రత్యేక ప్రవేశం లభిస్తుంది.
• చిత్ర ప్రదర్శనలు
• ప్యానెల్ చర్చలు
• మాస్టర్ క్లాసులు
• ప్రముఖులు పాల్గొనే కార్యక్రమాలు
• ప్రపంచవ్యాప్త ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు, కళాకారులతో ముఖాముఖి
మీడియా ప్రతినిధుల కోసం ఈ పోర్టల్ నవంబర్ 17, 2025 అర్థరాత్రి వరకు మాత్రమే తెరిచే ఉంటుంది.
దరఖాస్తుదారులు పోర్టల్‌లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా పాటించి, చెల్లుబాటు అయ్యే గుర్తింపు, వృత్తిపరమైన ఆధారాలతో సహా అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అర్హత నిబంధనలు, డాక్యుమెంటేషన్ మార్గదర్శకాలు అక్రెడిటేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
సహాయం కోసం సంప్రదించండి...
ఏదైనా సహాయం లేదా సందేహాల కోసం, జర్నలిస్టులు PIB IFFI మీడియా సపోర్ట్ డెస్క్‌ను ఈ క్రింది ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు:
ఐఎఫ్ఎఫ్ఐ మీడియా అక్రెడిటేషన్ పాలసీని ఇక్కడ చూడవచ్చు.
ఏదైనా సహాయం లేదా సందేహాల కోసం, జర్నలిస్టులు పత్రికా సమాచార కార్యాల యానికి చెందిన ఐఎఫ్ఎఫ్ఐ మీడియా సపోర్ట్ డెస్క్‌ను ఈ క్రింది ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఈమెయిల్: iffi.mediadesk@pib.gov.in
ఆసియాకు చెందిన గొప్ప సినీ ఉత్సవంలో భాగం కావడానికి ఉన్న ఈ చివరి అవకాశాన్ని కోల్పోవద్దు - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఐఎఫ్ఎఫ్ఐ 2025 కోసం మీ అక్రిడిటేషన్‌ను పొందండి.
***
Release ID:
2190437
| Visitor Counter:
4