ఆర్థిక మంత్రిత్వ శాఖ
మోసపూరితంగా రూ. 645 కోట్ల ఐటీసీ ప్రయోజనం పొందిన ముఠా గుట్టురట్టు కీలక వ్యక్తిని అరెస్టు చేసిన అధికారులు
प्रविष्टि तिथि:
13 NOV 2025 6:46PM by PIB Hyderabad
229 నకిలీ జీఎస్టీ నమోదిత సంస్థల ద్వారా మోసపూరితంగా ఐటీసీ (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) ప్రయోజనాలు పొందుతున్న ఢిల్లీకి చెందిన ఒక భారీ ముఠాను జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) ఢిల్లీ జోనల్ యూనిట్ పట్టుకుంది.
విశ్వసనీయ సమాచారం మేరకు డీజీజీఐ అధికారులు ఢిల్లీలోని పలు ప్రాంగణాల్లో సమన్వయంతో సోదాలు నిర్వహించారు. వస్తుసేవల వాస్తవ సరఫరా లేకుండానే ఇన్‌వాయిస్‌లు జారీ చేస్తున్న బోగస్ సంస్థలకు సంబంధించిన దస్త్రాలు, డిజిటల్ పరికరాలు, లెడ్జర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జీఎస్టీ లేదా బ్యాంకింగ్ అవసరాల కోసం ఓటీపీలు పొందడానికి ఉపయోగించిన 162 మొబైల్ ఫోన్లు, 44 డిజిటల్ సంతకాలు, వివిధ సంస్థల 200కు పైగా చెక్ బుక్‌లు ఉన్నాయి. ఈ బోగస్ సంస్థలు వస్తువులను సరఫరా చేయకుండానే ఇన్‌వాయిస్‌లు ఇచ్చాయని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. దీని ఫలితంగా దాదాపు రూ. 645 కోట్ల అర్హత లేని ఐటీసీ మోసం జరిగింది. ఇది ప్రభుత్వ ఖజనాకు నష్టాన్ని కలిగించింది.
ఈ నకిలీ సంస్థల నెట్‌వర్క్ కార్యకలాపాలను ముఖేష్ శర్మ అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, రికార్డులను నిర్వహించడం, బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడం, బహుళ స్థాయులలో చట్టవిరుద్ధంగా నిధులు పొందడంలో ఇతను చురుకైన పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించాయి. ముఖేష్ శర్మ చేసిన నేరాలు బెయిల్ పొందడానికి వీల్లేనివి. 2017 నాటి సీజీఎస్టీ చట్టంలోని 132(1)(బి), 132(1)(సి) సెక్షన్ల కింద 2025 నవంబర్ 11న అతన్ని అరెస్టు చేశారు.
ఈ దర్యాప్తులో మనీలాండరింగ్‌కు సంబంధించిన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. మోసపూరితంగా వచ్చిన మొత్తాన్ని ఒక ఎన్జీఓ, ఒక రాజకీయ సంస్థ ద్వారా నగదును దారిమళ్లించినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(रिलीज़ आईडी: 2190006)
आगंतुक पटल : 13