ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఇంకాంగ్ ఎల్. ఇంచెన్ మృతిపట్ల ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 12 NOV 2025 7:04PM by PIB Hyderabad

నాగాలాండ్ సీనియర్ నాయకుడు శ్రీ ఇంకాంగ్ ఎల్ఇంచెన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నాగాలాండ్ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన శ్రీ ఇంచెన్ చిరస్మరణీయులని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారుఅనేక సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో క్రియాశీలంగా ఉన్న ఆయన.. అహర్నిశలూ గిరిజన వర్గాల సంక్షేమానికే దృఢంగా కట్టుబడి ఉన్నారుశాసనసభ్యుడిగామంత్రిగా తన పదవీకాలంలో అంకితభావంతో ఆయన అందించిన విశేష సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

నాగాలాండ్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన శ్రీ ఇంకాంగ్ ఎల్ఇంచెన్ చిరస్మరణీయుడు. అనేక ఏళ్ల పాటు ప్రజా జీవితంలో క్రియాశీలంగా ఉన్న ఆయన.. ముఖ్యంగా గిరిజన వర్గాల సంక్షేమం కోసం శ్రమించారుశాసన సభ్యుడిగామంత్రిగా తన పదవీకాలంలో ఆయన అందించిన విశేష సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయినాగాలాండ్‌లో బీజేపీ బలోపేతం కోసం కూడా ఆయన ఎంతగానో కృషిచేశారుఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకుఅనుచరులకు సానుభూతి తెలుపుతున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2189451) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam