ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో పేలుడు.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పరిస్థితిపై హోం మంత్రి శ్రీ అమిత్ షాతో కలిసి సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2025 10:05PM by PIB Hyderabad

ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగిన పేలుడు ఘటన ప్రాణనష్టానికి దారి తీసింది.  దీనిపై  ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం పేలుడు కారణంగా తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయాన్ని అందిస్తున్నారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఇతర అధికారులతో  పరిస్థితిని సమీక్షించాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం పేలుడు ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి  నేను సంతాపం తెలపుతున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సాయాన్నందిస్తున్నారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించాను’’ అని పేర్కొన్నారు. 
@AmitShah

 


(రిలీజ్ ఐడి: 2188729) సందర్శకుల సూచీ సంఖ్య : : 42