ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: న్యాయసేవలు అందించే యంత్రంగాల బలోపేతంపై న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం

Posted On: 08 NOV 2025 7:30PM by PIB Hyderabad

సీజేఐ శ్రీ బీఆర్ గవాయ్ గారుజస్టిస్ సూర్య కాంత్ గారుజస్టిస్ విక్రమ్ నాథ్ గారుకేంద్రం ప్రభుత్వంలో నా సహచరులు అర్జున్ రామ్ మేఘవాల్ గారుసుప్రీంకోర్టులోని ఇతర గౌరవ న్యాయమూర్తులుహైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుమహిళలుపెద్దలారా..

ముఖ్యమైన ఈ సందర్భంలో మీ అందరి మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానున్యాయ సేవలను అందించే యంత్రాంగాన్ని బలోపేతం చేయడంన్యాయ సేవల దినోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం.. న్యాయ వ్యవస్థకు కొత్త బలాన్ని ఇస్తుంది. 20వ జాతీయ సదస్సు సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుమీరు ఈ ఉదయం నుంచే ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని నాకు తెలిసిందిఅందుకే నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోనుఇక్కడ హాజరైన ప్రముఖులకున్యాయవ్యవస్థలోని వ్యక్తులకున్యాయ సేవల సంస్థలకు నేను అభివాదం చేస్తున్నాను.

మిత్రులారా,

న్యాయం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడుఅది సమయానికి లభించినప్పుడుసామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా న్యాయం ప్రతి వ్యక్తికి అందినప్పుడు మాత్రమే అది సామాజిక న్యాయానికి పునాది అవుతుందిన్యాయ సేవ అనేది న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుందిజాతీయ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు న్యాయ సేవల సంస్థలు న్యాయ వ్యవస్థకుసాధారణ పౌరుడికి మధ్య ఒక వంతెనగా పనిచేస్తాయినేడు లోక్ అదాలత్‌లువివాదం ముందే సమస్యను పరిష్కరించటం ద్వారా.. లక్షలాది వివాదాలు త్వరగాస్నేహపూర్వకంగాతక్కువ ఖర్చుతో పరిష్కారం అవుతున్నందుకు నేను సంతృప్తిగా ఉన్నానుప్రతివాదులను అందించడం ద్వారా కేవలం మూడేళ్లలోనే దాదాపు లక్షల క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయిప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు దేశంలోని పేదదళితఅణగారినదోపిడీవంచనకు గురైన ప్రజలకు సులభతర న్యాయాన్ని అందించాయి.

మిత్రులారా,

గత 11 సంవత్సరాలుగా మేం నిరంతరం సులభతర వ్యాపారంసులభతర జీవనం పైన దృష్టి సారించాందీని కోసం మేం అనేక చర్యలు తీసుకున్నాంవ్యాపారాల కోసం 40 వేలకు పైగా అనవసరమైన నిబంధనలను తొలగించాంజన్ విశ్వాస్ చట్టం ద్వారా 3,400 కంటే ఎక్కువ చట్టపరమైన సెక్షన్లను నేర పరిధి నుంచి తొలగించాం. 1500 కంటే ఎక్కువ అసంబద్ధమైనకాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాందశాబ్దాలుగా అమలులో ఉన్న పాత చట్టాల స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చాం.

మిత్రులారా,

నేను ముందే చెప్పినట్లుగా సులభతర న్యాయం సరిగ్గా లభించినప్పుడు మాత్రమే సులభతర వ్యాపారం, సులభతర జీవనం సాధ్యమౌతాయిగత కొన్నేళ్లుగా సులభతర న్యాయాన్ని మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాంభవిష్యత్తులో మనం ఈ దిశగా మరింత వేగంగా ముందుకెళ్తాం.

మిత్రులారా,

ఈ సంవత్సరం జాతీయ న్యాయ సేవల సంస్థ (ఎన్ఏఎల్‌ఎస్ఏనాల్సా) 30వ వార్షికోత్సవం చేసుకుంటుందిఈ మూడు దశాబ్దాలలో నాల్సా దేశంలోని పేద ప్రజలను న్యాయవ్యవస్థకు అనుసంధానించడంలో చాలా కీలకమైన పనులు చేసిందిన్యాయ సేవల సంస్థలను ఆశ్రయించే ప్రజలకు సాధారణంగా వనరులు ఉండవు.. ప్రాతినిధ్యం ఉండదు.. కొన్నిసార్లు ఆశ కూడా ఉండదువారికి ఆశమద్దతునివ్వడమే సేవ అనే పదానికి నిజమైన అర్థంఇది 'నాల్సాఅనే పేరులో కూడా ఉందిఅందుకే ఇందులోని ప్రతి సభ్యుడు ఓర్పువృత్తి నైపుణ్యంతో పనిని కొనసాగిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది.

మిత్రులారా,

ఈ రోజు మనం నాల్సా సామాజిక మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్‌ను ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా చర్చలుఏకాభిప్రాయం ద్వారా వివాదాలను పరిష్కరించే భారతీయ సంప్రదాయంలోని ప్రాచీన జ్ఞానాన్ని మనం పునరుద్ధరిస్తున్నాం.

మిత్రులారా,

సాంకేతికత ఖచ్చితంగా ఒక పెను మార్పు తీసుకువచ్చే శక్తిఅయితే దానికి ప్రజానుకూల దృష్టి ఉంటే అది ప్రజాస్వామ్యీకరణ శక్తిగా మారుతుందియూపీఐ డిజిటల్ చెల్లింపులలో ఏ విధంగా విప్లవం తెచ్చిందో మనం చూశాంఈ రోజు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారుగ్రామాలకు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం లభించిందికొద్ది వారాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో సుమారు లక్ష మొబైల్ టవర్లను ఏకకాలంలో ప్రారంభించాంఅంటే సాంకేతికత నేడు సమ్మిళితత్వానికిసాధికారత కల్పించడానికి ఒక మాధ్యమంగా మారుతోందిన్యాయ పంపిణీలో ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ కూడా దీనికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చున్యాయ ప్రక్రియలను సాంకేతికత ఎలా ఆధునికంగామానవీయంగా మార్చగలదో ఇది తెలియజేస్తోంది-ఫైలింగ్ నుంచి ఎలక్ట్రానిక్ సమ్మన్స్ వరకువర్చువల్ విచారణల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ వరకు సాంకేతికత ప్రతి దానిని సులభతరం చేసిందిఇది న్యాయం కోసం పోరాడే మార్గాన్ని సులభతరం చేసిందిమీ అందరికీ తెలిసినట్లుగా ఈ ప్రాజెక్ట్ మూడో దశకు బడ్జెట్‌ను వేల కోట్ల పైకి పెంచాంఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

మిత్రులారా,

మనందరికీ న్యాయ అవగాహన ప్రాముఖ్యత తెలుసుఒక పేద వ్యక్తి హక్కులను తెలుసుకున్నప్పుడుచట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. వ్యవస్థలోని సంక్లిష్టత చూసి భయపడనప్పుడు మాత్రమే న్యాయం పొందగలడుఅందుకే బలహీన వర్గాలుమహిళలువృద్ధులలో న్యాయ అవగాహనను పెంచడం అనేది మన ప్రాధాన్యతమీరందరూమన కోర్టులు ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాయిఈ విషయంలో మన యువత ముఖ్యంగా న్యాయ విద్యార్థులు పరివర్తనాత్మక పాత్ర పోషించగలరని నేను నమ్ముతున్నానుపేదలుగ్రామాల్లో నివసించే ప్రజలతో అనుసంధానమయేందుకువాళ్లకు చట్టపరమైన హక్కులున్యాయ ప్రక్రియలను వివరించడానికి యువ న్యాయ విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే.. ఆయా విద్యార్థులకు సమాజపు నాడిని నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందిస్వయం సహాయక బృందాలుసహకార సంఘాలుపంచాయతీ రాజ్ సంస్థలుఇతర బలమైన క్షేత్ర స్థాయి సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా మనం న్యాయ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి చేర్చగలం.

మిత్రులారా,

న్యాయ సహాయానికి సంబంధించిన మరొక అంశం ఉంది. దాని గురించి నేను తరచుగా మాట్లాడుతూ ఉంటానున్యాయానికి సంబంధించిన భాష.. న్యాయం కోరుకునే వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఉండాలిచట్టాన్ని రూపొందించేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యంప్రజలు సొంత భాషలో చట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. అది ఆయా చట్టాలను మరింత మెరుగ్గా పాటించేందుకు దారితీస్తుందితద్వారా వ్యాజ్యాలు తగ్గుతాయిదీనితో పాటు తీర్పులున్యాయపరమైన పత్రాలు కూడా స్థానిక భాషలో అందుబాటులో ఉండటం అవసరంసుప్రీంకోర్టు 80 వేలకు పైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదించే పని ప్రారంభించటం నిజంగా ప్రశంసనీయంఈ ప్రయత్నం హైకోర్టులుజిల్లా స్థాయిలో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

మనం అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనిస్తున్న తరుణంలో న్యాయ వృత్తి, న్యాయ సేవలుఅనుబంధ వ్యక్తులందరూ.. ‘మనల్ని అభివృద్ధి చెందిన దేశం అని పిలుసున్నప్పుడు మన న్యాయ పంపిణీ వ్యవస్థ ఎలా ఉంటుందో ఊహించుకోండిమనం ఆ దిశగా కలిసి ముందుకు సాగాలి’ అన్న విషయంపై ఆలోచించాలినాల్సా‌కుసమస్త న్యాయ సోదర వర్గానికిన్యాయాన్ని అందించటంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానుమీ అందరితో ఉండే అవకాశం కల్పించినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలుధన్యవాదాలు.

 

***


(Release ID: 2188155) Visitor Counter : 2