రాష్ట్రపతి సచివాలయం
గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
04 NOV 2025 4:30PM by PIB Hyderabad
గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రపతి తన సందేశంలో.. “గురు నానక్ జయంతి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ.. ముఖ్యంగా మన సిక్కు సోదరులు, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈ శుభ సందర్భం మనకు గురు నానక్ దేవ్ గారి ఆదర్శాలు, విలువలను ఆచరించేందుకు ప్రేరణనిస్తుంది. మంచి సమాజాన్ని నిర్మించే దిశగా మనకు నిర్దేశం చేస్తుంది. సత్యం, న్యాయం, కరుణ ఆధారంగా జీవించడం నిజమైన విజయానికి కొలమానంగా ఆయన సందేశం మనకు నేర్పుతుంది. ఒకే దేవుడు అనే భావన, మానవ సమానత్వాన్ని ఆయన ఉపదేశాలు బోధిస్తాయి.నిజాయితీతో జీవించాలని, వనరులను పరస్పరం పంచుకోవాలని ఆయన మనకు నేర్పించారు.
ఈ సందర్భంగా మన జీవితాల్లో గురు నానక్ గారి సిద్దాంతాలను ఆచరించి, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ శాంతియుతమైన, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించేందుకు మనమంతా కృషి చేద్దాం.
(Release ID: 2186508)
Visitor Counter : 7