ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణం నష్టం పట్ల ప్రధాని సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2025 10:49AM by PIB Hyderabad

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తాం: ప్రధానమంత్రి"

 

“తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi"

 

***

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2185794) సందర్శకుల సూచీ సంఖ్య : : 48