ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో సాధించిన పురోగతిని వివరించే ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2025 7:20PM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా నుంచి డీప్ టెక్ వరకు.. చంద్రయాన్ నుంచి బయో ఎకానమీ వరకు.. అనేక రంగాల్లో భారత్‌ సాధించిన అద్భుతమైన పురోగతిని వివరిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ప్రపంచ స్థాయిలో వేగంగా ఎదుగుతున్న భారత్‌ నాయకత్వాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారుఅందరి సమిష్టి కృషితో దేశ శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని పునర్నిర్వర్వచిస్తోందని ఆయన పేర్కొన్నారుఆత్మవిశ్వాసంతో నిండిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ నేడు ప్రపంచానికి స్పూర్తిగా మారిందని అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు.

‘‘డిజిటల్ ఇండియా నుంచి డీప్ టెక్ వరకు.. చంద్రయాన్ నుంచి బయో ఎకానమీ వరకుమరెన్నో రంగాల్లో భారత్‌ రికార్డులను సృష్టిస్తోంది.

మనందరి కృషితో శాస్త్రసాంకేతికఆవిష్కరణల్లో ప్రపంచ నాయకత్వాన్ని భారత్‌ పునర్నిర్వచిస్తోందిఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికి స్ఫూర్తినిస్తోంది.

భారత్‌ సాధించిన పురోగతి గురించి మరింత తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాసిన కథనాన్ని చదవండి’’

 

***


(రిలీజ్ ఐడి: 2185530) సందర్శకుల సూచీ సంఖ్య : : 24