ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్- 2025లో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2025 10:32PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025లో తాను చేసిన ప్రసంగ ముఖ్య విషయాలు కొన్నింటిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన పలు పోస్టులలో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్‌లో ఆర్య సమాజ దివ్యమైన-భవ్యమైన సంప్రదాయం, వారసత్వాలను చూసి నా మనసు కొత్త శక్తి, ప్రేరణలతో నిండిపోయింది."
"ఆర్య మహాసమ్మేళనంలో మన కుమార్తెలు సంస్కృతంలో ఆధ్యాత్మిక మంత్రాలను పఠించడం అందరినీ మంత్రముగ్ధులను చేసింది."
"మహర్షి దయానంద సరస్వతి గారి 200వ జయంతిని పురస్కరించుకుని రూ. 200 ప్రత్యేక నాణెం, ఆర్య సమాజ్ 150వ వార్షికోత్సవ సందర్భంగా ఒక స్మారక నాణెం విడుదల చేసినందుకు గర్విస్తున్నాను."
"ఆర్య సమాజ స్థాపన 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దివ్యమైన సందర్భం సమాజంలోని ఒక వర్గంతోనో... శాఖతోనో ముడిపడినది కాదు. ఇది సామాజిక సంస్కరణల అద్భుత సంప్రదాయాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లిన గొప్ప వారసత్వానికి చిహ్నం."
"బానిసత్వ కాలంలో జాతీయ చైతన్యాన్ని తిరిగి మేల్కొలిపిన గొప్ప వ్యక్తిత్వం మహర్షి దయానంద సరస్వతి. భారత్ అభివృద్ధి చెందాలంటే అంటరానితనం, వివక్షత, నిరక్షరాస్యత సంకెళ్లను ఛేదించాలని ఆయనకు తెలుసు."
"మన మహిళలు ఈ రోజు అనేక రంగాల్లో నాయకత్వ పాత్రలను పోషిస్తున్న తీరు మన దేశంలో జరుగుతున్న లోతైన మార్పులకు ప్రత్యక్ష నిదర్శనం. దేశం సరైన మార్గంలో ముందుకు సాగడమే కాకుండా, స్వామి దయానంద్ జీ కలలను కూడా నెరవేరుస్తోందని ఇది స్పష్టం చేస్తుంది."
"ఈ రోజు దేశం మరోసారి 'స్వదేశీ' బాధ్యతను స్వీకరించిన తరుణంలో... ఆర్య సమాజం కోసం కొన్ని ప్రత్యేక అభ్యర్థనలు ఉన్నాయి..."
***
(రిలీజ్ ఐడి: 2185526)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam