ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు

Posted On: 01 NOV 2025 4:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వేర్వేరు సందేశాల్లో:

“ఈ రోజు ఛత్తీస్‌గఢ్ శాసనసభ కోసం అద్భుత, ఆధునిక సరికొత్త భవనాన్ని ప్రారంభించడంతోపాటు గౌరవనీయులైన అటల్ జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నా మదిలో మెదలిన భావాలను మీతో పంచుకుంటున్నాను…”

“అత్యాధునిక డిజిటల్ సదుపాయాలతో రూపొందిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ సౌధం భవిష్యత్తులో రాష్ట్ర విధివిధానాలు, విధాన రూపకర్తలకు కీలక కూడలి కాగలదని విశ్వసిస్తున్నాను. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఛత్తీస్‌గఢ్ ఉజ్వల భవితకు తోడ్పడతాయి...”

“మన కొత్త పార్లమెంటు భవనం గ్యాలరీలు గతకాలపు మూలాలతో దేశ ప్రజాస్వామ్యాన్ని అనుసంధానించిన రీతిలో ఛత్తీస్‌గఢ్ కొత్త శాసనసభ భవనం కూడా వారసత్వం-అభివృద్ధికి ప్రత్యేక సంగమం కాగలదని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను...”

“పౌర దేవో భవ’ (పౌరుడే మా దైవం) అన్నది మా సుపరిపాలన మంత్రం. అందుకే సంస్కరణలను వేగిరం చేయడంతోపాటు వీలైనంత వరకూ జనజీవన సౌలభ్యం కల్పన దిశగా చేసే చట్టాలకు మనం ప్రాధాన్యమివ్వాలి...”

“అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన సందర్భంగా ‘దేశం కోసం దేవుడు - దేశం కోసం రాముడు’ అని మనమంతా ప్రతిజ్ఞ చేశాం. తదనుగుణంగా ఆయన మాతృభూమి అయిన ఛత్తీస్‌గఢ్‌లో ఆ లోకోత్తరుని ఆదర్శాలను మనం సాకారం చేయాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 2185516) Visitor Counter : 6