ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2025 7:16PM by PIB Hyderabad

మహారాష్ట్ర, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారుఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారుజ్ఞాన జ్యోతి మహోత్సవ్ నిర్వహణా కమిటీ ఛైర్మన్ సురేంద్ర కుమార్ ఆర్య గారుడీఏవీ కళాశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు పూనం సూరి గారుప్రముఖ ఆర్య సాధువు స్వామి దేవవ్రత్ సరస్వతి గారుఆర్య ప్రతినిధి సభల అధ్యక్షులుఉపాధ్యక్షులకుదేశవిదేశాలకు చెందిన ఆర్యసమాజ్ సభ్యులకుసోదరీసోదరులారా!

ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతిఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగిందిదాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైందిఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నానుఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నానుసభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉందిమీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగాఅద్భుతంగా ఉంటుందిఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదంఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోందిమిమ్మల్ని కలిసిన ప్రతిసారీమీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తిస్ఫూర్తి నిండుతాయిఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారుఅక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారువారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.

స్నేహితులారా,

గతేడాది, దయానంద సరస్వతి స్వామి జన్మస్థలమైన గుజరాత్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగిందిదానిలో వీడియో లింక్ ద్వారా నేను ప్రసంగించానుఅంతకంటే ముందే.. మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాలను ఢిల్లీలో ప్రారంభించే భాగ్యం నాకు లభించిందిఆ సమయంలో వినిపించిన వేద మంత్రాల శక్తిపవిత్ర యాగం నిన్నే జరిగినట్లుగా అనిపిస్తున్నాయి.

స్నేహితులారా,

ఆ కార్యక్రమంలో, 200వ జయంతి ఉత్సవాలను ‘విచార్ యజ్ఞ’గా రెండేళ్ల పాటు నిర్వహించుకోవాలని మనం సమష్టిగా నిర్ణయం తీసుకున్నాంఎలాంటి అంతరాయం లేకుండా.. ఈ ‘అఖండ విచార యజ్ఞ’ రెండేళ్ల పాటు కొనసాగడం నాకు ఆనందంగా ఉందిఎప్పటికప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలుకార్యక్రమాల గురించి నాకు సమాచారం అందుతూనే ఉందిమరోసారి... ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం నాకు దక్కిందిస్వామి దయానంద సరస్వతి పాదపద్మాలకు నమస్కరిస్తూ.. నా నివాళులు అర్పిస్తున్నానుఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుఈ కార్యక్రమంలో ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసే అదృష్టం మనకు లభించింది.

స్నేహితులారా,

ఆర్యసమాజ్ ప్రారంభించి 150 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భం.. ఏ సమాజానికో లేదా వర్గానికో పరిమితం కాదుఇది భారతీయ వేద గుర్తింపుతో ముడిపడిన కార్యక్రమంఇది తనను తాను శుద్ధి చేసుకోగలిగే పవిత్ర గంగా ప్రవాహం లాంటి భారతీయ భావనను ప్రతిబింబించే కార్యక్రమంఇది సామాజిక సంస్కరణ అనే గొప్ప కార్యక్రమాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లినస్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులకు మేధోశక్తిని అందించిన గొప్ప సంప్రదాయానికి సంబంధించిన ఉత్సవంలాలా లజపతి రాయ్అమరవీరుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి దేశభక్తులుఇతర విప్లవ వీరులు ఆర్య సమాజ్ నుంచి స్ఫూర్తి పొంది.. తమ జీవితాలను స్వతంత్ర సాధనకు అంకితం చేశారుదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్య సమాజ్‌కు రాజకీయ కారణాల వల్ల తగినంత గుర్తింపు లభించకపోవడం దురదృష్టకరం.

స్నేహితులారా,

ప్రారంభమైన నాటి నుంచే.. ఆర్య సమాజ్ దేశ భక్తుల సంస్థగా కొనసాగుతోందిభారతీయత గురించి ఆర్యసమాజ్ ఎల్లప్పుడూ ధైర్యంగానిర్భయంగా మాట్లాడిందివిదేశీ భావజాలమైనావిభజన ఆలోచనలనైనా లేదా సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నాలనైనా భారత్‌ను వ్యతిరేకించే ప్రతి ఆలోచనను ఆర్యసమాజ్ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉందిఆర్యసమాజ్ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రోజున.. స్వామి దయానంద సరస్వతి ఆదర్శాలకు దేశంసమాజం కలసి ఘనంగా నివాళులు అర్పించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది.

స్నేహితులారా,

ఆధ్యాత్మిక మేలుకొలుపు, సంస్కరణోద్యమాల ద్వారా చరిత్రకు సరికొత్త దిశను అందించిన స్వామి శ్రద్ధానంద లాంటి మహానుభావుల శక్తిఆశీస్సులు ఈ చారిత్రక క్షణంలో మనతో ఉన్నాయిఅలాంటి గొప్ప వ్యక్తులకు ఈ పవిత్ర వేదిక నుంచి నమస్కరిస్తూ.. నివాళులు అర్పిస్తున్నాను.

స్నేహితులారా,

అనేక విధాలుగా భారత దేశం చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్ర భూమిఈ నాగరికతఈ వేద సంప్రదాయం తరతరాలుగా అజరామరంగా ఉన్నాయిఎందుకంటే.. కష్ట సమయాలు ఎదురైనప్పడుకాలం అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఓ గొప్ప వ్యక్తిఓ మహర్షిఓ దార్శనికుడుఈ నేలపై జన్మించి మన సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తారుదయానంద సరస్వతి కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తేశతాబ్దాల తరబడి బానిసత్వంలో దేశాన్ని మగ్గిపోయేలా చేసిన వలస పాలన సమయంలో ఆయన జన్మించారుఆలోచనల స్థానంలో మూఢనమ్మకాలుసామాజిక రుగ్మతలు వచ్చి చేరాయిమన సంప్రదాయాలునమ్మకాలను బ్రిటిష్ వారు చిన్నచూపు చూశారుమనల్ని తక్కువ చేసి చూపించి దేశంలో వారి దురాక్రమణను సమర్థించుకున్నారుఅలాంటి పరిస్థితుల్లో సమాజం కొత్తగాసొంతంగా ఆలోచించే ధైర్యాన్ని కోల్పోతుందిఅలాంటి కష్ట సమయంలోనే ఓ యోగి ఉద్భవించారునిర్జన హిమాలయాల్లో.. అత్యంత కఠిన పరిస్థితుల్లో తపస్సుధ్యానం చేసి తనను తాను పరీక్షించుకున్నారుతాను తిరిగి వచ్చిన తర్వాత ఆత్మన్యూనతా భావంలో చిక్కుకున్న సమాజాన్ని మేల్కొలిపారుభారత్ గుర్తింపును మరింత కించపరిచే పనిలో మొత్తం వలస పాలన వ్యవస్థ నిమగ్నమై ఉన్నక్షీణిస్తున్న నైతికసామాజిక విలువలను ఆధునికతగా పాశ్చాత్యీకరిస్తున్న సమయంలో.. ఈ యోగి ‘‘వేదాలను తిరిగి అనుసరించండివేదాలను తిరగి అనుసరించండి!’’ అని ప్రజలకు పిలుపునిచ్చారుఆ మహనీయుడే స్వామి దయానందబానిసత్వంతో మగ్గిన ఆ చీకటి యుగంలో అణచివేతకు గురయిన.. జాతీయ చైతన్యాన్ని తిరిగి మేల్కొలిపారు.

స్నేహితులారా,

భారత్ అభివృద్ధి చెందాలంటే... రాజకీయ బానిస సంకెళ్లను మాత్రమే తెంచుకుంటే సరిపోదని స్వామి దయానంద సరస్వతి అర్థం చేసుకున్నారుసమాజాన్ని విభజిస్తున్న సామాజిక బంధనాలను సైతం తెంచుకోవాలిఅందుకే వివక్షఅంటరానితనంపేదధనిక అనే భావనలను స్వామి దయానంద సరస్వతి వ్యతిరేకించారుఅంటరానితనాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారునిరక్షరాస్యతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారువేదాలనుగ్రంథాలను తప్పుగా ప్రచారం చేసే వారిని ప్రశ్నించారు. ‘శాస్త్రార్థ’ (మేధావుల చర్చఅనే పురాతన భారతీయ సంప్రదాయం ద్వారా విదేశీ కట్టుకథలను ఎదుర్కొని.. వాస్తవాలను నిరూపించారు.

స్నేహితులారా,

ఆ కాలంలో స్వామి దయానంద సరస్వతి ఓ దార్శనికుడు. వ్యక్తి నిర్మాణంలోనూసామాజిక నిర్మాణంలోనూ ‘నారీశక్తి’ (మహిళా సాధికారతఅత్యంత కీలకపాత్ర పోసిస్తుందని ఆయనకు తెలుసుఅందుకే.. నాలుగ్గోడల మధ్య మహిళల్ని బంధించి ఉంచే ఆలోచనను ధైర్యంగా ప్రశ్నించారుఆర్యసమాజ పాఠశాలల్లో బాలికలను అక్షరాస్యులను చేసే ఉద్యమాన్ని ప్రారంభించారుఆ రోజుల్లో జలంధర్లో బాలికల కోసం ప్రారంభించిన పాఠశాల.. తర్వాత కన్యా మహా విద్యాలయ (మహిళా కళాశాల)గా మారిందిఆర్య సమాజ్ నెలకొల్పిన ఇలాంటి పాఠశాలల నుంచి లక్షలాది మంది అమ్మాయిలు విద్యను అభ్యసించారుఇప్పుడు వారు ఈ దేశ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నారు.

స్నేహితులారా,

ఈ వేదిక మీద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నారు. రెండు రోజుల క్రితం.. స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలసి మన రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ రోజు మన అమ్మాయిలు.. యుద్ధ విమానాలు నడుపుతున్నారుడ్రోన్ దీదీలుగా మారి ఆధునిక వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళుతున్నారుప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది మహిళా స్టెమ్ గ్రాడ్యుయేట్లు భారత్‌లోనే ఉన్నారని మనం గర్వంగా చెప్పగలంశాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళలు నాయకత్వ పాత్రను పోషిస్తున్నారుమన అగ్రశ్రేణి సైన్స్ సంస్థల్లో మహిళా శాస్త్రవేత్తలు.. మంగళయాన్చంద్రయాన్గగన్‌యాన్ లాంటి మిషన్లలో కీలకపాత్ర పోషించారుదేశం సరైన మార్గంలో నడుస్తుందనిస్వామి దయానంద ఆశయాలు నెరవేరుతున్నాయని ఈ మార్పు తెలియజేస్తుంది.

స్నేహితులారా,

స్వామి దయానంద ఆశయాల్లో ఒకదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. దానిని చాలా మందితో కూడా పంచుకున్నాను. ‘‘ఎవరు తక్కువ తీసుకుని.. ఎక్కువ తోడ్పాటును అందిస్తారో.. వారే నిజమైన పరిణతి చెందినవారు’’ అని స్వామీజీ అన్నారుఈ అలతి పదాల్లో దాగున్న గొప్ప ఆలోచనను పూర్తిగా వివరించడానికి అనేక పుస్తకాలు రాయాల్సి ఉంటుందిఒక ఆలోచనకున్న అసలైన శక్తి దాని అర్థంలో ఉండదుఅది ఎంత కాలం కొనసాగింది.. ఎంత మంది జీవితాలను మార్చిందన్న దానిలోనే ఉంటుందిదీని ఆధారంగా మహర్షి దయానంద ఆశయాలను పరీక్షించినప్పుడుఆర్య సమాజ్‌ను అనుసరించే వారిని చూసినప్పుడు.. ఆ ఆలోచనలు కాలంతో మరింత శక్తిమంతమవుతున్నాయని మనం గుర్తించగలుగుతాం.

సోదరీసోదరులారా,

పరోపకారిణి సభను స్వామి దయానంద సరస్వతి ప్రారంభించారు. ఆయన నాటిన విత్తనం ఇప్పుడు పెద్ద వృక్షంగా మారి అనేక శాఖలతో విస్తరించిందిగురుకుల్ కాంగ్రిగురుకుల్ కురుక్షేత్రడీఏవీ సంస్థలుఇతర విద్యాసంస్థలు అన్నీ తమ రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తున్నాయిదేశం సమస్యలను ఎదుర్కొన్న ప్రతి సారి ఆర్యసమాజ్ సభ్యులు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించారుదేశ విభజన సమయంలో సర్వం కోల్పోయిన శరణార్థులకు సహాయంపునరావాసంవిద్యను అందించడంలో ఆర్య సమాజ్ కీలకపాత్ర పోషించిందిఇప్పటికీ.. ప్రకృతి వైపరీత్యాలను సంభవించినప్పుడు సేవలందించడంలో ఆర్య సమాజ్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.

సోదరీసోదరులారా,

ఆర్య సమాజ్ చేసిన అన్ని పనులకు దేశం రుణపడి ఉంది. వాటిలో అతి ముఖ్యమైనది.. పురాతన సంప్రదాయమైన గురుకుల సంప్రదాయాన్ని పరిరక్షించడంఒకానొకప్పుడు గురుకుల విధానం ద్వారానే విజ్ఞానంశాస్త్రంలో దేశం అగ్రభాగాన ఉండేదివలస పాలన సమయంలో ఈ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందిఫలితంగా.. మన విజ్ఞానం నాశనమైందిమన విలువలు బలహీనమయ్యాయిమన యువ తరాలు దిశను కోల్పోయాయిఅంతరించిపోతున్న గురుకుల సంప్రదాయాన్ని పునరుద్ధరించిపరిరక్షించేందుకు ఆర్య సమాజ్ ముందుకు వచ్చిందికాలానుగుణంగా గురుకులాలను నవీకరించిపురాతన విలువలను పరిరక్షిస్తూనే ఆధునిక విద్యను అందిస్తోందిఇప్పుడు మరోసారిమన దేశం జాతీయ విద్యా విధానం ద్వారా విలువలువ్యక్తిత్వ నిర్మాణంతో విద్యను ఏకీకరిస్తోందిఈ పవిత్ర భారతీయ విద్యా సంప్రదాయాన్ని పరిరక్షించిన ఆర్య సమాజ్‌కు కృతజ్ఞతలు.

స్నేహితులారా,

మన వేదవాక్కు: ‘‘కృణ్వంతో విశ్వమార్యం’’ అంటే.. ఈ ప్రపంచాన్ని గొప్పగా మారుద్దాంఉన్నతమైన ఆలోచనలుపనుల ద్వారా ఈ మానవాళిని ఉద్ధరిద్దాంఈ వేద సారాంశాన్నే ఆర్య సమాజ్ లక్ష్యంగా స్వామి దయానంద స్వీకరించారు.

ఈ వేద సూత్రమే.. భారత అభివృద్ధికి మార్గదర్శక సూత్రమైన భారత ప్రగతి ద్వారా ప్రపంచ సంక్షేమంభారత శ్రేయస్సు ద్వారా మానవాళికి సేవగా మారింది. ప్రస్తుతం సుస్థిరాభివృద్ధికి ప్రపంచ గొంతుకగా భారత్ మారింది. ‘‘వేదాలను తిరిగి స్వీకరించాలి’’ అని ఒకప్పుడు స్వామి పిలుపు ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు వేద జీవన విధానం వైపు రావాలని భారత్ ప్రపంచానికి పిలుపునిస్తోందిమేం మిషన్ లైఫ్ (పర్యావరణహిత జీవన విధానంప్రారంభించాందీనికి ప్రపంచ మద్దతు లభిస్తోంది. ‘‘ఒకే సూర్యుడుఒకే ప్రపంచంఒకే గ్రిడ్’’ లక్ష్యం ద్వారా స్వచ్ఛ విద్యుత్‌ను అంతర్జాతీయ ఉద్యమంగా మార్చుతున్నాంఅంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా ఇప్పుడు 190 దేశాలకు చేరుకుందిఅంతర్జాతీయంగా యోగాను స్వీకరించడంసమతుల్యమైననిర్మాణాత్మకమైన జీవితాన్ని గడపాలనే ఆలోచనలైఫ్ లాంటి పర్యావరణ కార్యక్రమాల పట్ల ప్రపంచం చూపిస్తున్న ఆసక్తి.. ఇవన్నీ ఆర్య సమాజ సభ్యులు తమ దైనందిన జీవితంలో చాలాకాలంగా అనుసరిస్తున్న విలువలేఆర్య సమాజ ప్రజలు సరళమైన జీవనశైలిసేవా స్ఫూర్తిభారతీయ ఆహార్యంసంస్కృతిపర్యావరణం పట్ల ప్రేమభారతీయ విలువలను పెంపొందించడం కొనసాగిస్తారు.

సోదరీసోదరులా,

అందుకే.. ‘‘సర్వే భవంతు సుఖిన:’’ (అందరూ సంతోషంగా ఉండాలిఅనే ప్రాచీన విధానాన్ని భారత్ ముందుకు తీసుకెళుతోందిమానవాళి సంక్షేమానికి చేపడుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది. ‘విశ్వ బంధు’ (ప్రపంచానికి నిజమైన స్నేహితుడు)గా తన పాత్రను బలోపేతం చేసుకుంటోందిఆర్యసమాజ్‌లోని ప్రతి సభ్యుడు ఈ లక్ష్యాన్ని తమదిగానే భావిస్తారుదీనికి మీ అందరినీ అభినందిస్తున్నాను.

స్నేహితులారా,

150 ఏళ్ల క్రితం స్వామి దయానంద సరస్వతి వెలిగించిన జ్ఞాన జ్యోతి ఇప్పటికీ ఆర్య సమాజ్ ద్వారా సమాజానికి వెలుగు పంచుతూనే ఉందిమనందరిలోనూ స్వామీజీ ఓ బాధ్యతాయుమైన భావనను మేల్కొలిపారని నేను భావిస్తున్నానుఅదే కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంమూస ధోరణులను విచ్ఛిన్నం చేయడంఅవసరమైన చోట సంస్కరణలను తీసుకురావడంమీరెప్పుడూ నా మీద అభిమానాన్ని కురిపిస్తూనే ఉన్నారుఅందుకే నేను మీకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానునేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చామీరందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఇస్తారని నాకు తెలుసుమీరందరూ దేశ నిర్మాణమనే మహా యజ్ఞంలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారుకానీ ప్రస్తుత దేశ ప్రాధాన్యాల్లో కొన్నింటిని మీ ముందుకు తీసుకు వస్తున్నానుఉదాహరణకుస్వదేశీ ఉద్యమంతో ఆర్య సమాజ్‌కు దీర్ఘ అనుబంధం ఉందిఈ రోజు.. మరోసారి స్వదేశీ ఉద్యమానికి దేశం పిలుపునిచ్చి, ‘ఓకల్ ఫర్ లోకల్’ గా మారుతోందిదీనిలో మీ పాత్ర కీలకం కానుంది.

స్నేహితులారా,

కొన్ని రోజుల క్రితం జ్ఞాన భారతం కార్యక్రమాన్ని ప్రారంభించామని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. భారతీయ పురాతన రాతప్రతులను భద్రపరిచిడిజిటలీకరణ చేయడమే దీని లక్ష్యంమన భవిష్యత్తు తరాలు వాటితో అనుసంధానమై.. వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే అపారమైన విజ్ఞానాన్ని అందించే ఈ అమూల్యమైన సంపదకు నిజమైన రక్షణ లభిస్తుందికాబట్టి నేను ఆర్య సమాజానికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానుమీరు గత 150 ఏళ్లుగా భారత పవిత్ర పురాతన రాతప్రతులను గుర్తించి భద్రపరిచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారుతరాలుగామన పురాతన గ్రంథాలను వాటి అసలు రూపంలోనే పరిరక్షించడంలో ఆర్య సమాజ్ సభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నారుఈ ప్రయత్నాన్ని జ్ఞాన భారతం మిషన్ జాతీయ స్థాయికి తీసుకెళుతుందిదీన్ని మీ కార్యక్రమంగానే భావించండిమీ తోడ్పాటును అందించండిమీ గురుకులాలువిద్యాసంస్థల్లో యువతను ఈ తాళపత్రాలను అధ్యయనం చేసేలా ప్రోత్సహించండి.

స్నేహితులారా,

మహర్షి దయానంద్ 200వ జయంతి సందర్భంగా, ‘యజ్ఞాల్లో’ ఉపయోగించే ధాన్యాల గురించి నేను మాట్లాడానుమనందరికీ యజ్ఞంలో శ్రీ అన్న ప్రాధాన్యం గురించి తెలుసుఇలాంటి పూజల్లో ఉపయోగించే ధాన్యాలను పవిత్రమైనవిగా భావిస్తారువీటితో పాటుగా.. భారతీయ సంప్రదాయంలోని మన చిరుధాన్యాలనుశ్రీ అన్న వారసత్వాన్ని కూడా మనం ప్రోత్సహించాలిసహజంగా పెరగడమే ఈ చిరుధాన్యాల ప్రత్యేకతఇప్పుడే ఆచార్య జీ వివరించినట్లుగా.. ఒకప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రకృతి వ్యవసాయం బలమైన ఆధారంగా ఉండేదిఇప్పుడు మరోసారి దాని విలువను ఈ ప్రపంచం గుర్తిస్తోందిప్రకృతి వ్యవసాయానికున్న ఆర్థికఆధ్యాత్మిక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిందిగా ఆర్యసమాజ్‌ను నేను కోరుతున్నాను.

స్నేహితులారా,

జల సంరక్షణ మరో ముఖ్యమైన అంశం. ఈ రోజుప్రతి గ్రామానికీ జల్ జీవన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు మేం కృషి చేస్తున్నాంప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమాల్లో జల్ జీవన్ మిషన్ ఒకటిఅయినప్పటికీ.. భవిష్యత్తు తరాలకు తగినంత నీరు మిగిలి ఉంటేనే వాటి ప్రయోజనం నెరవేరుతుందిదీన్ని సాధించడానికే బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాంఅలాగే దేశవ్యాప్తంగా 60,000 అమృత్ సరోవర్ (పవిత్ర సరస్సు)లను నిర్మించాంప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలతో పాటు.. సమాజం కూడా ఈ విషయంలో ముందుకు రావాలిసాధారణంగా.. ప్రతి గ్రామంలోనూ.. చెరువులుసరస్సులుబావులునీటి కుంటలు ఉండేవికానీ మారుతున్న పరిస్థితుల్లో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎండిపోయాయివాటిని పునరుద్ధరించాల్సినసహజ నీటి వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని నిరంతరం ప్రజలకు తెలియజేస్తూ ఉండాలితక్షణావసరమైన ఇంకుడు గుంతలు నిర్మించివర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ ప్రచార కార్యక్రమమే ‘‘క్యాచ్ ద రెయిన్’’.

స్నేహితులారా,

చాలాకాలం నుంచి చేపడుతున్న ‘‘ఏక్ పేడ్, మా కే నామ్’’ (అమ్మ పేరుతో ఓ చెట్టుప్రచారం కూడా విజయవంతమైందిఈ క్యాంపెయిన్ కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే చేపట్టే కార్యక్రమం కాదుఈ మొక్కలు నాటడం నిరంతరం సాగే ప్రక్రియఈ గొప్ప కార్యక్రమంలో మరింత మందిని ఆర్య సమాజ్ భాగస్వామ్యం చేయాలి.

స్నేహితులారా,

‘‘సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతాం’’ అని మన వేదాలు మనకు బోధిస్తాయిఅంటే.. ‘‘మనం కలసి నడుద్దాంకలసి మాట్లాడదాంఒకరి మనసుని మరొకరు అర్థం చేసుకుందాం’’ అని అర్థంమరో మాటలో చెప్పాలంటే.. మన ఆలోచనలను పరస్పర గౌరవించుకుంటూ సామరస్యంతో ఉండాలిదేశ సంకల్పాన్ని మన వ్యక్తిగత సంకల్పంగా మార్చుకోవడానికిప్రజా భాగస్వామ్యం ద్వారా సమష్టి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి దేశం అందించిన సందేశంగా ఈ వేదసారాన్ని మనం పరిగణించాలిగడచిన 150 ఏళ్లలో.. ప్రతి పనిలోనూ ఈ స్ఫూర్తిని ఆర్యసమాజం నింపుకొందిఈ స్ఫూర్తిని మనం బలోపేతం చేయాలి. మానవ సంక్షేమ మార్గంలో మహర్షి దయానంద సరస్వతి బోధనలు మనకు దిశానిర్దేశం చేస్తాయిఈ నమ్మకంతో.. మరోసారి ఆర్యసమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుధన్యవాదాలునమస్కారం.

 

***


(రిలీజ్ ఐడి: 2185501) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam