ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఐక్యతా ప్రతిజ్ఞ చేయించిన కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు

Posted On: 31 OCT 2025 2:06PM by PIB Hyderabad

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నేడు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటామని చెబుతూ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

కేంద్ర శాస్త్ర,సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ప్రతిజ్ఞను చేయించారు.

ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ పి.కె మిశ్రా , ప్రధానమంత్రి రెండో ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతిష్ చంద్ర, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని.. ఐక్యతా, శక్తిమంతమైన భారత్‌ అనే ఆయన దార్శనికతను స్మరించుకుంటూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా తెలిపింది.

‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో “కేంద్ర మంత్రి @DrJitendraSingh ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి రెండో ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి అతిష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు’’

 

***


(Release ID: 2184743) Visitor Counter : 7