ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతికి నివాళులు అర్పిస్తున్న భారత్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 31 OCT 2025 8:05AM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ వారసత్వాన్ని ప్రధానమంత్రి గౌరవ ప్రపత్తులతో స్మరించుకొంటూ, భారతదేశ ఏకీకరణలో పటేల్ ప్రేరణాశక్తిగా నిలిచారన్నారు. దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తరువాతి కాలంలో, భారత భవితకు రూపురేఖల నివ్వడంతో పటేల్ నిర్ణయాత్మక పాత్రను పోషించారని ప్రధానమంత్రి అన్నారు. జాతీయ సమగ్రత పట్ల, సుపరిపాలన పట్ల, ప్రజాసేవ పట్ల సర్దార్ పటేల్‌కు ఉన్న తిరుగులేని నిబద్ధత రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూ ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.

సమైక్య, ప్రబల, స్వయంసమృద్ధియుక్త భారత్‌ను ఆవిష్కరించే అంశంలో సర్దార్ పటేల్‌ దృష్టికోణాన్ని సాకారం చేయాలని దేశ ప్రజలంతా  సంకల్పించుకొన్నారని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజానీకం ఆయనకు నివాళులను అర్పిస్తోంది. భారత్‌ను ఏకీకరించడంలో ఆయన ప్రేరణ శక్తిగా నిలిచారు. మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాతి కాలంలో భారత్ భాగ్యాన్ని తీర్చిదిద్దారాయన. జాతీయ సమగ్రత పట్ల, సుపరిపాలన పట్ల, ప్రజాసేవ పట్ల ఆయన అచంచల నిబద్ధత భావి తరాల వారికి స్ఫూర్తిని అందిస్తూ ఉంటుంది. సమైక్య, సశక్త, ఆత్మనిర్భర్ భారత్‌ అవతరించాలన్న ఆయన దృష్టికోణాన్ని సాకారం చేస్తామన్న మన ఉమ్మడి సంకల్పాన్ని కూడా పునరుద్ఘాటిద్దాం’’ అని పేర్కొన్నారు.

 

***

 


(Release ID: 2184501) Visitor Counter : 6