మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని పాఠశాలల్లో 3వ తరగతి నుంచే ఏఐ పాఠ్యాంశాలు


‘మన చుట్టూ ఉన్న ప్రపంచం’తో ముడిపడిన ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా

కృత్రిమ మేధ విద్యను పరిగణించాలి - పాఠశాల విద్యా విభాగ కార్యదర్శి

Posted On: 30 OCT 2025 5:00PM by PIB Hyderabad

ఆధునిక విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-కంప్యూటేషనల్ థింకింగ్ (ఏఐ, సీటీలను కీలక విభాగాలుగా ముందుకు తీసుకెళ్లడం పట్ల తన నిబద్ధతను విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం (డీవోఎస్ఈ&ఎల్పునరుద్ఘాటించిందినేషనల్ కరిక్యులమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఎఫ్ ఎస్ఈ)-2023 విస్తృత లక్ష్యానికి అనుగుణంగా సంప్రదింపుల ప్రక్రియ ద్వారా అర్థవంతమైనసమగ్రమైన పాఠ్యాంశాలను రూపొందించడంలో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో పాటు సీబీఎస్ఈఎన్‌సీఈఆర్‌టీకేవీఎస్ఎన్‌వీఎస్ వంటి సంస్థలకు ఈ విభాగం మద్దతునిస్తోంది.

అభ్యసనంఆలోచించడంబోధించడం అనే భావనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-కంప్యూటేషనల్ థింకింగ్ (ఏఐ, సీటీబలోపేతం చేస్తుందిక్రమంగా "ప్రజా ప్రయోజనం కోసం ఏఐఅనే ఆలోచన దిశగా ఇది విస్తరిస్తుందిసంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఏఐని నైతికంగా ఉపయోగించే దిశగా ఈ కార్యక్రమం కొత్తది... ముఖ్యమైన ముందడుగు అవుతుందిదీని ద్వారా సాంకేతికత గ్రేడ్ నుంచి ప్రారంభమయ్యే ప్రాథమిక దశ నుంచే విద్యలో సహజంగానే భాగం అవుతుంది.

సీబీఎస్ఈఎన్‌సీఈఆర్‌టీకేవీఎస్ఎన్‌వీఎస్బాహ్య నిపుణులు సహా నిపుణుల సంఘాలతో 2025 అక్టోబర్ 29న సంబంధిత వాటాదారులు సంప్రదింపులు నిర్వహించారుఏఐ-సీటీ పాఠ్యాంశాలను రూపొందించడం కోసం ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ కార్తీక్ రామన్ అధ్యక్షతన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ సంప్రదింపుల సందర్భంగా డీవోఎస్ఈఎల్ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘మన చుట్టూ ఉన్న ప్రపంచం (టీడబ్ల్యూఏయూ)’ తో అనుసంధానించే ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా ఏఐ విద్యను పరిగణించాలని స్పష్టం చేశారుపాఠ్యాంశాలు విస్తృతంగాసమ్మిళితంగాఎన్‌సీఎఫ్ఎస్ఈ-2023కి అనుగుణంగా ఉండాలన్నారుప్రతి బిడ్డ ప్రత్యేక సామర్థ్యం మా ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారువిధాన నిర్ణేతలుగా మా పని కనీస పరిమితిని నిర్వచించడంమారుతున్న అవసరాల ఆధారంగా దానిని తిరిగి సమీక్షించడమేనని శ్రీ సంజయ్ కుమార్ తెలిపారు.

నిష్ట ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూల్స్వీడియో ఆధారిత అభ్యసన వనరుల వంటి ఉపాధ్యాయ శిక్షణఅభ్యసన-బోధనా మెటీరియల్ పాఠ్యాంశాల అమలుకు వెన్నెముకగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారుఎన్‌సీఎఫ్ఎస్ఈ ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ ద్వారా ఎన్‌సీఈఆర్‌టీసీబీఎస్ఈ మధ్య సహకారం... సజావుగా ఏకీకరణ చేయడంనిర్మాణాత్మకంగా మార్చడంనాణ్యతకు హామీని నిర్ధారిస్తుందన్నారుక్రాస్-నేషనల్క్రాస్-ఇంటర్నేషనల్ బోర్డుల విశ్లేషణలను పరిగణించడంపలు దేశాల దృక్కోణంలో ప్రపంచం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడం మంచిదన్న శ్రీ కుమార్... మనం అనుసరించే విధానం మన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

పాఠ్యాంశాల రూపకల్పనఅమలు విషయంలో నిర్ధిష్ట సమయపాలనకు కట్టుబడి ఉండాల్సిన ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ సంయుక్త కార్యదర్శి (ఐ అండ్ టీశ్రీమతి ప్రాచి పాండే తన ప్రసంగాన్ని ముగించారు.

ముఖ్యాంశాలు

1.     ఎన్ఈపీ-2020, ఎన్‌సీఎఫ్ఎస్ఈ-2023లకు అనుగుణంగా గ్రేడ్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కంప్యూటేషనల్ థింకింగ్ పాఠ్యాంశాలను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడం.

2.    ఎన్‌సీఎఫ్ఎస్ఈ ఆధ్వర్యంలో ఏఐ-సీటీ పాఠ్యాంశాలుసమయం కేటాయింపువనరుల ఏకీకరణ.

3.    డిసెంబర్ 2025 నాటికి రిసోర్స్ మెటీరియల్స్హ్యాండ్‌బుక్‌లుడిజిటల్ వనరులను అభివృద్ధి చేయడం.

4.    నిర్ధిష్ట గ్రేడ్‌కు అనుగుణంగాసమయానుకూలంగా నిష్టఇతర సంస్థల ద్వారా ఉపాధ్యాయ శిక్షణను రూపొందించడం.

 

***


(Release ID: 2184448) Visitor Counter : 8