సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లైట్స్, కెమెరా, అక్రెడిటేషన్! 56వ ఐఎఫ్ఎఫ్ఐకి దరఖాస్తు చేసుకునేందుకు మీడియా ప్రతినిధులకు

Posted On: 29 OCT 2025 3:32PM by PIB Hyderabad

నవంబర్ 5 వరకు అవకాశం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
మీడియాకు ప్రత్యేక అవకాశం.. ఐఎఫ్ఎఫ్ఐ-2025లో ఎఫ్ టీఐఐ ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు
Posted On: 29 OCT 2025 3:32PM by PIB Mumbai
మీడియా ప్రతినిధిగా 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐవార్తల్ని రాసేందుకు ఎదురుచూస్తున్నారా?
అధికారిక పోర్టల్ లో మీడియా ప్రతినిధిగా నమోదు చేసుకోండి:
https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx

గోవాలోని పనాజీలో 2025 నవంబర్ 20 నుంచి 28 వరకు ఐఎఫ్ఎఫ్ఐ 56వ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారుప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులుకళాకారులు హాజరవుతున్న ఈ ఉత్సవాల్లో చలనచిత్ర ప్రదర్శనలుప్యానెల్ చర్చలుమాస్టర్ క్లాసులునెట్ వర్కింగ్ సెషన్లకు గుర్తింపు పొందిన మీడియా నిపుణులు హాజరుకావచ్చు.

గుర్తింపు కార్డు పొందిన మీడియా వ్యక్తుల కోసం ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ టీటీఐనవంబర్ 18, 2025న నిర్వహించనుందిగతంలో ఈ కోర్సుకు హాజరుకాలేకపోయిన జర్నలిస్టులకు ఈ ఏడాది ప్రాధాన్యతనిస్తారు.
అక్రెడిటేషన్ కోసం నవంబర్ 5, 2025 వరకు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు పోర్టల్ లోని సూచనలను పాటించాలిచెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డువృతిపరమైన ఆధారాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందిపూర్తి వివరాలుఅర్హతల మార్గదర్శకాలు అక్రిడిటేషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
మరింత సమాచారం కోసం జర్నలిస్టులు పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐ మీడియా వెబ్ సైట్ ను iffi.mediadesk@pib.gov.inను సంప్రదించవచ్చు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రధాన డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓఝా మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా విభిన్న సినీ నిపుణుల అభిప్రాయాలను పంచుకునే ప్రతిష్ఠాత్మక వేదిక ఐఎఫ్ఎఫ్ఐఈ ఉత్సవాన్ని సమగ్రంగా కవర్ చేయడంలో పాత్రికేయులకు చేయూతను అందిస్తూఅక్రెడిటేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పీఐబీ సిద్దంగా ఉందిఅని అన్నారు.
గోవాలోని పనాజీలో ఏర్పాటు చేయనున్న ఐఎఫ్ఎఫ్ఐ.. భారతదేశ చలనచిత్ర వారసత్వాన్ని కీర్తిస్తూప్రపంచ సహకారాన్నిసృజనాత్మకతను పెంపొందిస్తుందిఏటా 45,000 మందికి పైగా సినీ ప్రియులునిపుణులు తొమ్మిది రోజుల సినీ వేడుక సందర్భంగా ఒక వేదికపైకి చేరతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను స్ఫూర్తిని నింపేసవాలు చేసేప్రజలను ఏకం చేసే కథనాలు వారి కోసం సిద్ధంగా ఉంటాయి.

 

***


(Release ID: 2184257) Visitor Counter : 2