ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయిలో మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి తాను ప్రసంగించినప్పటి కొన్ని అంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 29 OCT 2025 10:54PM by PIB Hyderabad

ముంబయిలో మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి తాను ప్రసంగించినప్పటి కొన్ని దృశ్యాలను  ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

‘ఎక్స్’లో శ్రీ మోదీ వేరు వేరు సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘నౌకావాణిజ్య రంగానికి చెందిన ప్రముఖుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా, ఈ  రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతున్న తీరుపై మరింత లోతైన అవగాహనను ఏర్పరుచుకొనే సావకాశం దక్కింది.’’

‘‘2025 సంవత్సరం దేశ నౌకావాణిజ్య రంగానికి ఎంతో కీలకమైన సంవత్సరంగా రుజువైంది. ఈ సంవత్సరంలో మా విజయాల తాలూకు చెప్పుకోదగ్గ అనేక ఉదాహరణలను గమనించ గలిగాం..’’

‘‘ఈ ఏడాది భారత నౌకావాణిజ్య రంగంలో కొత్త తరం సంస్కరణల విషయమై అనేక ప్రధాన నిర్ణయాల్ని తీసుకున్నాం. ఈ నిర్ణయాలతో మా పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పుంజుకుంటుందని నేను నమ్ముతున్నాను.’’
 
‘‘గత 11 సంవత్సరాల్లో భారత నౌకా వాణిజ్య రంగంలో చరిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటిలోకీ అత్యంత సమర్థమైన ఓడరేవుల సరసన మా ఓడరేవులూ స్థానాన్ని సంపాదించుకోవడం మాకు గర్వకారణం.’’

‘‘సముద్రాలు కేవలం సరిహద్దులు కావు, అవకాశాల నిలయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ దృష్టికోణం మాకు నేర్పింది. ఇదే ఆలోచనతో నేటి భారత్ ముందుకు కదులుతోంది.’’  

‘‘అన్ని దేశాలను కలుపుకొని మరీ నౌకావాణిజ్య రంగంలో అభివృద్ధి మార్గాన ముందుకుపోవడంపై భారత్ ప్రస్తుతం దృష్టిని సారించింది. మనమంతా కలిసికట్టుగా శాంతి, ప్రగతి, సమృద్ధిల దిశగా ముందుకు పోవాలి. మన భూగ్రహం దీర్ఘకాలం పాటు మనగలిగేటట్టు మనం అందరం కృషి చేయాల్సి ఉంది.’’

 

***


(Release ID: 2184254) Visitor Counter : 4