ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0’లో యువత పాల్గొనాలని కోరిన ప్రధానమంత్రి

Posted On: 27 OCT 2025 8:40PM by PIB Hyderabad

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0’లో యువత చురుకుగా పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కోరారుదేశ నిర్మాణానికి దోహపడేందుకు ఇదొక విలువైన అవకాశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజనులంతా పాల్గొని, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి కోరారుముందుగా నిర్వహించే ప్రత్యేక క్విజ్ పోటీలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని యువతకు విన్నవించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“ దేశ నిర్మాణానికి దోహదపడేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0 ఒక గొప్ప అవకాశంమన యువత ఆలోచనలులోతైన పరిశీలనలు వికసిత్ భారత్‌ను సాకారం చేసుకునే మార్గాన్ని చూపుతాయి.

ఈ కార్యక్రమంలో చేరాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్విజ్ పోటీలో పాల్గొనాలిమీరందరూ దీనికి హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను”

 

***


(Release ID: 2183455) Visitor Counter : 4