కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘‘ప్రయివేటు ప్రసార సంస్థలకు డిజిటల్ రేడియో ప్రసారాల విధాన రూపకల్పన’’పై 2025 అక్టోబరు 3 న జారీ చేసిన సిఫారసుల సమగ్ర పత్రం
Posted On:
27 OCT 2025 1:17PM by PIB Hyderabad
ప్రయివేటు రంగంలోని రేడియో ప్రసార సంస్థలకు డిజిటల్ రేడియో ప్రసార విధానాన్ని రూపొందించే అంశంపై టీఆర్ఏఐ చట్టం-1997లో 11 (1) (ఎ) (i) సెక్షన్ కింద టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (టీఆర్ఏఐ..ట్రాయ్) సిఫారసులను ఆహ్వానిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) కిందటేడాది ఏప్రిల్ 23న ఒక లేఖను రాసింది.
ట్రాయ్ తన సిఫారసులను ప్రభుత్వానికి ఈ నెల 3న నివేదించింది.
పైన ప్రస్తావించిన సిఫారసులకు సంబంధించి ఒక పత్రాన్ని ట్రాయ్ ఈ రోజు జారీ చేసింది. ఈ కారిజెండమ్‌ను ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.in లో కూడా అందుబాటులో ఉంచారు.
ఏదైనా స్పష్టీకరణ లేదా అదనపు సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే +91-11- 20907774 నంబరుకు ఫోన్ చేసి, ట్రాయ్ సలహాదారు (ప్రసారం, కేబుల్ సేవలు) డాక్టర్ దీపాలీ శర్మను అడిగి తెలుసుకోవచ్చు.
***
(Release ID: 2183083)
Visitor Counter : 7