పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొలిసారి ఆసియా పసిఫిక్ ప్రమాద దర్యాప్తు సమూహ సమావేశం... వర్క్‌షాప్‌నకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌


అక్టోబర్ 28 నుంచి 4 రోజులపాటు జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న 90 మంది విమాన ప్రమాద దర్యాప్తు అధికారులు

Posted On: 26 OCT 2025 10:55AM by PIB Hyderabad

భారత్‌ తొలిసారిగా ఆసియా-పసిఫిక్ విమాన ప్రమాదాల పరిశోధన సమూహా (ఏపీఏసీ-ఏఐజీసమావేశంవర్క్‌షాప్‌నకు ఆతిథ్యం ఇవ్వనుందిఈ కార్యక్రమం న్యూఢిల్లీలో 2025 అక్టోబర్ 28 నుండి 31 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుందిదీనిని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విమాన ప్రమాదాల పరిశోధన సంస్థ (ఏఏఐజీనిర్వహిస్తుందిఈ సమావేశాన్ని కేంద్ర విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు.

ఈ సమావేశం ప్రతి ఏటా జరుగుతుందిఇందులో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఐసీఏఓ సభ్యదేశాలుపలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారుసాధారణంగా ఈ సమావేశానికి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ఏదో ఒక ఐసీఏఓ సభ్యదేశం ఆతిథ్యం ఇస్తుంది.

తొలిసారిగా భారత్‌ ఏపీఏసీ-ఏఐజీ ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. 90 మంది ఆసియా పసిఫిక్ దేశాల విమాన ప్రమాదాల పరిశోధన అధికారులుఐసీఏఓ నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

ఈ సమావేశంలో విమాన ప్రమాదాల దర్యాప్తునకు సంబంధించిన వివిధ అంశాలు.. పరిశోధన విధానాలునివేదికలుఅంతర్జాతీయ ప్రమాణాలపై చర్చలు జరగుతాయిప్రమాద/ఘటనల దర్యాప్తు సంస్థల మధ్య నైపుణ్యాలుఅనుభవాలుసమాచారాన్ని పంచుకోవడం అలాగే ఆసియాపసిఫిక్ ప్రాంతాల్లో పరిశోధన సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ సమావేశాల ఉద్దేశం.

ఈ వర్క్‌షాప్‌ అక్టోబర్ 28, 29 తేదీల్లో జరుగుతుందిఇందులో విమాన ప్రమాదాల దర్యాప్తు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారుఏఏఐబీడీజీసీఏ అధికారులతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు.

అక్టోబర్ 30, 31 తేదీల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఐసీఏఓ సభ్యదేశాల ప్రతినిధులుఏఏఐబీ అధికారులు ఈ చర్చలకు సారధ్యం వహిస్తారు.

 

***


(Release ID: 2182734) Visitor Counter : 3