ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీయూష్ పాండే మృతి.. ప్రధానమంత్రి సంతాపం

Posted On: 24 OCT 2025 11:29AM by PIB Hyderabad

వాణిజ్య ప్రకటనలుకమ్యూనికేషన్ల రంగ దిగ్గజం శ్రీ పీయూష్ పాండే మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారుశ్రీ పాండే అసాధారణ సృజనాత్మక ప్రతిభనూభారతదేశ వాణిజ్య ప్రకటనల రంగానికి ఆయన అందించిన మహత్తర సేవలనూ ప్రధానమంత్రి నిండుమనసుతో ఓ సందేశంలో స్మరించుకొన్నారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూఇలా పేర్కొన్నారు:

‘‘పీయూష్ పాండే గారి సృజనాత్మక ప్రజ్ఞ ప్రశంసనీయంవాణిజ్య ప్రకటనలుకమ్యూనికేషన్ల జగతికి స్మరణీయ సేవలను అందించారాయనగత కొన్నేళ్లలో మేం ఇద్దరం చర్చించిన అంశాల్ని నేను చాలా ఆప్యాయంగా నా మదిలో పదిలపరుచుకొంటానుఆయన మరణ వార్త తెలిసిఎంతో బాధపడ్డానుఆయన కుటుంబానికీఆయన అభిమానులకూ నా సానుభూతిని తెలియజేస్తున్నానుఓం శాంతి.’’

 

 

 

***

MJPS/SR


(Release ID: 2182111) Visitor Counter : 12