భారత ఎన్నికల సంఘం
బీహార్ ఎన్నికలు- 2025: ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజున ఎంసీఎంసీ ద్వారా ప్రచార ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ
Posted On:
21 OCT 2025 9:45AM by PIB Hyderabad
-
బీహార్ శాసనసభకు సాధారణ ఎన్నికలు- 2025తోపాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీలను 2025 నవంబరు 6 (గురువారం), 2025 నవంబరు 11 (మంగళవారం)గా నిర్ణయించారు.
-
రాష్ట్ర/జిల్లా స్థాయిలోని మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) ముందస్తుగా ధ్రువీకరిస్తే తప్ప.. ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి, సంస్థ లేదా వ్యక్తి పోలింగ్ రోజున, పోలింగుకు ఒక రోజు ముందు పత్రికల్లో ఎలాంటి ప్రకటనలనూ ప్రచురించకూడదు. ఎన్నికల ప్రచారం నిష్పాక్షికంగా జరిగేలా చూడడం కోసం ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.
-
బీహార్‌కు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉండే రోజులు 2025 నవంబరు 5, 6 (తొలి దశలో), 2025 నవంబరు 10, 11 (రెండో దశలో).
-
ముద్రణ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి, ముందస్తు ధ్రువీకరణ కోసం.. ప్రకటన ప్రచురించే ప్రతిపాదిత తేదీకి రెండు రోజుల ముందులోగానే తప్పక దరఖాస్తు చేసుకోవాలి.
-
ఆ ప్రకటనల పరిశీలన, ముందస్తు ధ్రువీకరణ, వేగంగా నిర్ణయాలను వెలువరిచేలా చూస్తూ.. సకాలంలో ముందస్తు ధ్రువీకరణను అందించడం కోసం రాష్ట్ర/ జిల్లా స్థాయిల్లో ఎంసీఎంసీ క్రియాశీలంగా పనిచేస్తోంది.
****
(Release ID: 2181400)
Visitor Counter : 19