ఉప రాష్ట్రపతి సచివాలయం
సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బందికి నివాళి అర్పించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
प्रविष्टि तिथि:
21 OCT 2025 4:29PM by PIB Hyderabad
ధైర్య సాహసాలు ప్రదర్శించి, త్యాగాన్ని చాటిన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్ నివాళి అర్పించారు.
మన పోలీసు బలగాల అసామాన్యమైన ధైర్యసాహసాలు, అత్యున్నత త్యాగాన్ని గౌరవించుకునే ఘట్టం పోలీసు సంస్మరణ దినోత్సవమని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. దేశ రక్షణ, ప్రజా భద్రత, సంక్షేమం పట్ల వారి అచంచలమైన నిబద్ధత ప్రజలందరికీ వారిపై విశేష గౌరవాన్ని కలిగిస్తున్నాయన్నారు.
సంక్షోభ సమయాల్లోనూ, మానవతా సాయం అవసరమైన వేళల్లోనూ స్థిరమైన అంకితభావం, సేవ పట్ల సంసిద్ధత ద్వారా.. ధైర్యసాహసాలు, కరుణ, కర్తవ్య దీక్షకు పోలీసు సిబ్బంది ఉదాహరణగా నిలుస్తున్నారని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
***
(रिलीज़ आईडी: 2181397)
आगंतुक पटल : 18