నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఫిలిప్పీన్స్‌తో సాంకేతిక బదిలీ ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌధరి నాయకత్వం
प्रविष्टि तिथि:
21 OCT 2025 9:02AM by PIB Hyderabad
ఫిలిప్పీన్స్‌తో సాంకేతిక బదిలీకి సంబంధించిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ జయంత్ చౌధరి నాయకత్వం వహిస్తున్నారు. 2025, అక్టోబర్ 20 నుంచి 22 వరకుజరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహిస్తోంది.
నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉన్నతాధికారులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణకు చెందిన ప్రతినిధులు భారతీయ బృందంలో ఉన్నారు.
ఈ పర్యటనలో వలస కార్మికుల విభాగం (డీఎండబ్ల్యూ), సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ (టీఈఎస్‌డీఏ), ఫిలిప్పీన్స్ గణాంకాల సంస్థ (పీఎస్ఏ), ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ (ఓడబ్ల్యూడబ్ల్యూఏ) లాంటి కీలకమైన ఫిలిప్పీన్ సంస్థలతో వ్యూహాత్మక చర్చలు చేపడతారు.
నైపుణ్యాభివృద్ధి, కార్మికుల తరలింపు, డేటా ఆధారిత తయారీ తదితర అంశాలకు సంబంధించి పరస్పరం సాంకేతిక బదిలీ, ప్రస్తుతం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పంచుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది.
మానవ వనరుల అభివృద్ధిలో, పరస్పర జ్ఞాన సముపార్జనను ప్రోత్సహించడంలో, నైపుణ్యాలు, పారిశ్రామికత ద్వారా సమానమైన, సుస్థిర వృద్ధికి మార్గాలు రూపొందించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఉమ్మడి అంకితభావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.



Photo: ఫిలిప్పీన్స్ ప్రభుత్వ వలస కార్మికుల విభాగం (డీఎండబ్ల్యూ)తో సమావేశం
***
(रिलीज़ आईडी: 2181147)
आगंतुक पटल : 25